తెలంగాణ

telangana

Jaggareddy: కాంగ్రెస్​కు రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన జగ్గారెడ్డి

By

Published : Jan 6, 2022, 7:02 PM IST

Updated : Jan 6, 2022, 8:37 PM IST

కాంగ్రెస్​ పార్టీలోనే ఉంటానని.. తాను ఏ పార్టీలోకి వెళ్లనని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్‌ను కలుస్తానని ఆయన ప్రకటించారు. తన బాధను అధిష్ఠానానికి నేరుగా వివరిస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు.

Jaggareddy: కాంగ్రెస్​లోనే ఉంటా.. ఏ పార్టీలోకి వెళ్లను: జగ్గారెడ్డి
Jaggareddy: కాంగ్రెస్​లోనే ఉంటా.. ఏ పార్టీలోకి వెళ్లను: జగ్గారెడ్డి

Jaggareddy: కాంగ్రెస్​లోనే ఉంటా.. ఏ పార్టీలోకి వెళ్లను: జగ్గారెడ్డి

Jaggareddy: చివరి క్షణం వరకు తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో తనకు ఉన్న ఇబ్బందులను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, రాహుల్‌ గాంధీలకు వివరిస్తానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన జగ్గారెడ్డి.. ఊహాగానాలకు తెరదించారు. బుధవారం జరిగిన పీఏసీ సమావేశంలో తన ఇబ్బందులను వివరించినట్లు జగ్గారెడ్డి తెలిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌ కూడా తాను చెప్పిన విషయాలను సావదానంగా విన్నారన్నారు.

పార్టీలో జరుగుతున్న వ్యవహారాల వల్ల తనకు ఇబ్బంది అవుతుందని, సంక్రాంతి తరువాత సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్​లను కలుస్తానని జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ తనదో...రేవంత్‌రెడ్డిదో జాగీర్‌ కాదని వ్యాఖ్యానించారు. రాజకీయంగా కొన్ని ఇబ్బందులు తనకు ఉన్నా.. పార్టీకి నష్టం కలిగించే పని ఏది చేయనని స్పష్టం చేశారు. ఒకవేళ పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురైతే.. ఇంటికే పరిమితమవుతానని ఇతర పార్టీలో మాత్రం చేరనని స్పష్టం చేశారు.

లే ఔట్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లోనూ ఇళ్లు, స్థలాలు క్రమబద్ధీకరించాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన వాటిని కూల్చడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ప్రజలు లక్షల రూపాయలు అప్పు చేసి ఇల్లు నిర్మించుకుని ఉంటారని.. ప్రజల కోణంలో ఆలోచించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాలోని గ్రామపంచాయతీల్లో అక్రమ ప్లాట్లు, ఇళ్లను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఈ నెల 8న ఇందిరాపార్క్​ వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. కొవిడ్​ నిబంధనలకు లోబడి 10మందితో దీక్ష చేస్తామన్నారు. తమకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్​లోనే ఉంటా..

'పార్టీ అంతర్గత విషయాలు బయట చెప్పను. రాత్రి నుంచి నాతో చాలా మంది నాయకులు మాట్లాడారు. నాకు ఉన్న బాధలను పీఏసీ సమావేశంలో చెప్పాను. మానిక్కం ఠాగూర్ నేను చెప్పిన విషయాలను విన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా.. ఏ పార్టీలోకి వెళ్లను. సంక్రాంతి తర్వాత దిల్లీ వెళ్తా.. సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్, మానిక్కం ఠాగూర్​లను కలుస్తా. నా బాధలను వారికి నేరుగా వివరిస్తా. పార్టీలో ఉన్న ఇబ్బందులను తెలియజేస్తా.'-జగ్గారెడ్డి, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​

ఇదీ చదవండి:

Last Updated :Jan 6, 2022, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details