తెలంగాణ

telangana

ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి: విద్యుత్​ ఉద్యోగులు

By

Published : Feb 3, 2021, 2:13 PM IST

విద్యుత్ రంగం ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా నిర్మల్​లో విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. విద్యుత్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.

electricity employees protest in nirmal district
ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి: విద్యుత్​ ఉద్యోగులు

నిర్మల్​లో విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించి.. ఆ శాఖ​ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తే విద్యుత్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్ సవరణ బిల్లు 2021 విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ కోసం రూపొందించిన స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్​ను ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. కెఎస్​ఈబీ లిమిటెడ్ మాదిరిగా రాష్ట్రాల్లోని అన్ని జనరేటింగ్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని కోరారు. విద్యుత్ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కాంటాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:మొన్న కోళ్లు.. నిన్న కాకులు.. ఇవాళ కుక్కలు

ABOUT THE AUTHOR

...view details