తెలంగాణ

telangana

భారీ వర్షాలు.. నీట మునిగిన పంటపొలాలు

By

Published : Sep 14, 2020, 3:10 PM IST

నల్గొండ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి.

heavy rains in nalgonda district from last 2 days
భారీ వర్షాలు.. నీట మునిగిన పంటపొలాలు

నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు, చెరువులు అలుగు పోస్తున్నాయి. కొన్ని చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. నల్గొండలో 23.3, తిప్పర్తి 28.6, కనగల్ 22.2, మాడ్గులపల్లిలో 22.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ముఖ్యంగా తిప్పర్తి, మాడుగులపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు తెగిపోయి.. కోతకు వచ్చిన వరి పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఫలితంగా ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీచూడండి.. '5 రాష్ట్రాల నుంచే 60 శాతం కరోనా కేసులు'

ABOUT THE AUTHOR

...view details