తెలంగాణ

telangana

Farmers protests for tokens: టోకెన్ల కోసం పడిగాపులు.. కడుపు మండి ఆందోళనలు..

By

Published : Nov 3, 2021, 4:53 PM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు టోకెన్ల కోసం రైతులు చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తోంది. వచ్చిన ధాన్యానికి తగ్గట్లు టోకెన్లు ఇవ్వకపోవడం, సరైన సమాధానం చెప్పేవారు లేక రైతులు ఆగ్రహంతో ఆందోళనలు చేపట్టాల్సిన పరిస్థితి వస్తోంది. వరుసగా రెండురోజులు ధర్నాలు చేసిన అన్నదాతలు ఇవాళ కూడా వేములపల్లి, సూర్యాపేటలో ఆందోళనలు చేపట్టారు. టోకెన్ల పంపిణీ విషయంలో అధికారుల తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేశారు.

Farmers protests for tokens
టోకెన్ల కోసం అన్నదాతల ఆందోళన

నల్గొండ జిల్లా వేములపల్లిలో టోకెన్ల కోసం అన్నదాతలు ఆందోళనకు(Farmers protests for tokens) దిగారు. అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ధర్నాకు దిగారు. వేములపల్లిలో వ్యవసాయ శాఖ అధికారులు రేపటి నుంచి ఆరో తేదీ వరకు వరి కోసేందుకు టోకెన్లు(Farmers protests for tokens) జారీ చేశారు. 800 టోకెన్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. 600 టోకెన్లు మాత్రమే ఇచ్చారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.

అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రైతులు రహదారిపై మోహరించారు. వారి ధర్నాతో రోడ్డుపై(Farmers protests for tokens) భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

సూర్యాపేట జిల్లాలోనూ ఇదే పరిస్థితి..

సూర్యాపేట జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆరుగాలం శ్రమించి వరి పండించి.. చివరకు పంట కోసేందుకు టోకెన్ల కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. టోకెన్ ఉంటేనే వరి కోసే విధానాన్ని అమలు చేస్తున్నారు. త్రిపురారంలో తెల్లవారుజామున నుంచే అన్నదాతలు టోకెన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు.

అసలే వాతావరణం బాగాలేదని.. వర్షం వస్తే పంట నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 50 నుంచే 100 టోకెన్లు మాత్రమే ఇస్తున్నారని... వీటి సంఖ్య ఇంకా పెంచాలని కోరుతున్నారు.

అద్దంకి నార్కట్​పల్లి రహదారిపై అన్నదాతల ధర్నా

ఇదీ చదవండి:Congress meeting News: సీఎల్పీ నేత అయితే ఏంటి.. భట్టిపై రేణుకా చౌదరి ఫైర్​

ABOUT THE AUTHOR

...view details