తెలంగాణ

telangana

స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నిరసన

By

Published : Aug 24, 2020, 8:38 PM IST

స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కూడలిలో సీపీఎం ఆధ్వర్యంలో శ్రేణులు నిరసన చేపట్టారు.

స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నిరసన
స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నిరసన

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం నిరుపేదలకు రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కూడలి వద్ద నిరసన చేపట్టారు. రెండు పడక గదుల ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితా సిద్ధమైనప్పటికీ వారికి అందించడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. లాక్​డౌన్​ సమయంలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న అసంఘటిత కార్మికులు, నిరుపేదలకు, మోటారు వాహన రంగానికి చెందిన వారికి నెలకు రూ.7,500 చొప్పున ఇవ్వాలని డిమాండ్​ చేశారు. వలస నివారణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.

ఇదీ చూడండి:'తెలంగాణ ఏర్పడిన తర్వాత స్వర్ణయుగం వచ్చింది'

ABOUT THE AUTHOR

...view details