తెలంగాణ

telangana

మాస్టారు మమ్మల్ని విడిచి వెళ్లొద్దు.. ఇక్కడే ఉండండి..

By

Published : Nov 6, 2022, 10:56 AM IST

Headmaster of Tribal Girls Ashram School: గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న నాగేశ్వరరావు బదిలీపై వెళ్లారు. వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువు బడిని వీడిపోవద్దంటూ, విద్యార్థినులు రోదిస్తూ మాస్టారు వెళ్లకుండా గేటు వేసి ఇక్కడే ఉండిపోవాలని ప్రాథేయపడ్డారు. మాస్టారు వచ్చాక మోనూ సక్రమంగా అమలు చేయడం, నాణ్యమైన ఆహారం అందించేలా చేశారని విద్యార్థులు గుర్తుచేసుకున్నారు.

Headmaster of Tribal Girls Ashram School
Headmaster of Tribal Girls Ashram School

Headmaster of Tribal Girls Ashram School: కామేపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న నాగేశ్వరరావు బదిలీపై వెళ్లారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు బడిని వీడిపోవద్దంటూ విద్యార్థినులు రోదించారు. నాగేశ్వరరావు మాస్టారు వెళ్లకుండా గేటు వేసిన విద్యార్థులు ఇక్కడే ఉండిపోవాలని ప్రాథేయపడ్డారు. విద్యార్థుల ఏడుపు చూసి ప్రధానోపాధ్యాయుడు సైతం భావోద్వేగానికి గురయ్యారు.

ఏడాది క్రితం డిప్యూటేషన్‌పై నాగేశ్వరరావు మాస్టారు వచ్చాక మోనూ సక్రమంగా అమలు చేయడమే కాకుండా నాణ్యమైన ఆహారం అందించేలా చొరవ చూపారని గుర్తుచేసుకున్నారు. పదో తరగతి ఫలితాల్లో 100% ఫలితాలు సాధించడం, ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించారని కొనియాడారు. తండ్రిలా తమను సన్మార్గంలో నడిపారని తెలిపారు. నాగేశ్వరరావు స్థానంలో ప్రధానోపాధ్యాయుడిగా భద్రాద్రి జిల్లా సర్వారం ఆశ్రమ పాఠశాలకు చెందిన రమేష్ బదిలీపై వచ్చి విధుల్లో చేరారు.

మాస్టారు మమ్మల్ని విడిచి వెళ్లొద్దు.. మీరే కావాలి...!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details