తెలంగాణ

telangana

మునిగిపోయిన పంటలు.. రైతుల కంట కన్నీటి 'వరదలు'

By

Published : Jul 17, 2022, 8:38 PM IST

Paddy Loss in Telangana: వర్షం వెలిసినా.. ముంపు మాత్రం వీడలేదు. రోజులు గడుస్తున్నా పొలాలు ఇంకా వరదలో చిక్కుకొని ఉన్నాయి. పలు ప్రాంతాల్లో ఇసుక మేట వేసి నాట్లు వేసిన పంట భూములు నామరూపాల్లేకుండా దెబ్బతిన్నాయి. కామారెడ్డి, కరీంనగర్‌ జిల్లాల్లో పలుచోట్ల... వరి, పత్తి, సోయా, మెుక్కజొన్న పంటలు కొట్టుకుపోయాయి. ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

Paddy Loss due to heavy floods in Telangana
Paddy Loss due to heavy floods in Telangana

Paddy Loss in Telangana: రాష్ట్రంలో వానలు తగ్గినా వరద కష్టాలు మాత్రం రైతులను వీడట్లేదు. ముంచెత్తిన వరదలతో కారణంగా పంటపొలాలు ఇంకా చెరువులను తలపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో వరితో పాటు ఆరుతడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు రెండున్నర లక్షల ఎకరాలకు పైగా పత్తి , సోయా, మెుక్కజొన్న , మినుము, పెసర, కంది సాగు చేశారు. వరదలకు పంటలన్ని పూర్తిగా నీటమునిగాయి. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్‌లో వెయ్యి 70 ఎకరాలు, బిచ్కుందలో 467 ఎకరాలు, జుక్కల్ 292 ఎకరాలు దెబ్బతిన్నాయని.. 6 వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం మోతోవాగుపై నిర్మించిన చెక్‌డ్యాంకు గండి పడటంతో కర్షకులు తీవ్రంగా నష్టపోయారు. ఇసుక మేటలు వేయటంతో పంటపొలాలు ఉపయోగం లేకుండా పోయాయి. రామడుగు, షా నగర్, కోరిటపల్లి, మోతె, వన్నారం రైతుల భూములు చాలా చోట్ల మీటరు లోతు కోతకు గురయ్యాయి. ఫలితంగా రైతులకు భారీ నష్టం వాటిల్లింది. పచ్చటి పొలాల్లో ఇసుక పేరుకుపోవటంతో అన్నదాతలు కలత చెందుతున్నారు. రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ వరద కారణంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details