తెలంగాణ

telangana

స్వామివారి ఉత్సవాల్లో శునకాల పోటీలు

By

Published : Nov 3, 2019, 10:24 AM IST

సాధారణంగా వెంకటేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా పాటలు, నృత్యాల పోటీలు జరుపటం చూస్తూ ఉంటాం. కానీ అందుకు భిన్నంగా జోగులాంబ గద్వాల జిల్లా పాగుంట లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో శనివారం శునకాల పరుగు పోటీలను నిర్వహించారు. బహుమతులూ ఇచ్చారు.

స్వామివారి ఉత్సవాల్లో శునకాల పోటీలు

జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం పాగుంటలో స్వయంభు శ్రీవెంకటేశ్వరస్వామి ఉత్సవాల సందర్భంగా వినూత్న పోటీలు నిర్వహించారు. ఎద్దులతో బండలాగుడు, శునకాల పరుగు పోటీలు ఆకట్టుకున్నాయి. విజేతలకు బహుమతులు ఇచ్చారు.

జిల్లా నుంచి కాక ఇతర ప్రాంతాల నుంచి వివిధ జాతులకు చెందిన 22 శునకాలను వాటి యజమానులు పోటీలకు తీసుకువచ్చారు. శునక పోటీలను తిలకించేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు.

స్వామివారి ఉత్సవాల్లో శునకాల పోటీలు

ఇదీ చూడండి : ఆర్టీసీ కార్మికుల సమ్మె యథాతథం: థామస్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details