తెలంగాణ

telangana

Telangana Govt Letter to KRMB : రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపేలా చర్యలు తీసుకోవాలి.. కేఆర్​ఎంబీకి ప్రభుత్వం లేఖ

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2023, 7:11 PM IST

Telangana Govt Letter to KRMB about Rayalaseema Lift Irrigation Scheme : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను కొనసాగిస్తోందని.. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల ఈఎన్సీ మురళీధర్‌ కేఆర్‌ఎంబీకి లేఖ రాశారు.

TS Govt Letter to KRMB
TS Govt Letter to KRMB Chairman about AP

TS Govt Letter to KRMB Chairman About Rayalaseema Lift Irrigation Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కొనసాగిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం(Rayalasema Lift Prrigation Project) పనులను నిలిపేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(Krishna River Management Board)ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాసిన తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపడుతోందని లేఖలో పేర్కొన్నారు.

జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను ధిక్కరిస్తోందని.. 1976, 1977 అంతర్రాష్ట్ర ఒప్పందాలకు విరుద్ధంగా బేసిన్ వెలుపలకు నీటిని తరలించే పనులు కొనసాగిస్తోందని ఫిర్యాదు చేశారు. చెన్నై తాగునీటి సరఫరా, రాయలసీమ తాగునీటి అవసరాలు, వెలిగోడు, సోమశిల, కండలేరు జలాశయాల కోసం 59 టీఎంసీల నీటిని తరలించేలా పనులు కొనసాగిస్తోందని పేర్కొంది. బచావత్ ట్రైబ్యునల్‌కు విరుద్ధంగా బేసిన్ వెలుపలకు నీటిని తరలించే పనులు కొనసాగిస్తున్నారన్నారు. కేవలం 1500 క్యూసెక్కుల నీటిని మాత్రమే తరలించాల్సి ఉండగా.. 80వేల క్యూసెక్కుల సామర్థ్యం వరకు పనులు చేపట్టారని తెలిపింది.

Union Cabinet Annoucements to Telangana : తెలంగాణకు కేంద్రం వరాలు జల్లు.. గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు​

Telangana Govt complaint to KRMB About AP : శ్రీశైలం కుడికాల్వకు లైనింగ్ పనులను కూడా చేపడుతున్నారని గతంలోనే ఫిర్యాదు చేసినట్లు లేఖలో గుర్తు చేశారు. ఒప్పందాలు, ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన పనుల వల్ల తెలంగాణ ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రజలకు ఉన్న న్యాయమైన హక్కులను కాపాడాలని బోర్డుకు విజ్ఞప్తి చేశారు.

అనధికార రిజర్వాయర్లలో నిల్వ చేసేవి నికర జలాలే..!

Krishna Tribunal : ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 89 ప్రకారం కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించడానికి ట్రైబ్యునల్‌ పదవీ కాలం పొడిగిస్తూ.. కేంద్రం గతంలో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలపై ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని చాలాసార్లు కోరింది. ఈ విషయంపై 2014లో కేంద్రం తగిన నిర్ణయం తీసుకోకపోవడంతో.. 2018లో తెలంగాణ సుప్రీంకోర్టు తలుపులను తట్టారు. ఆ తర్వాత 2021లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో భేటీలో ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని.. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ అడ్డంకిగా మారిందని కేంద్రం తెలిపింది. దీంతో గత్యంతరం లేక పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ తర్వాత ట్రైబ్యునల్‌ గడువు పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం మరోమారు వాయిదా.. కారణం అదేనా..!

ఏపీ వాటాకు మించి నీటిని వాడుకుంది.. కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ లేఖ

ABOUT THE AUTHOR

...view details