తెలంగాణ

telangana

Telangana Decade celebrations 2023 : దశదిశలా దద్దరిల్లేలా 'తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు'

By

Published : May 31, 2023, 9:44 AM IST

Telangana Decade celebrations 2023 : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలకు రాష్ట్రం సమాయత్తం అవుతోంది. అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు ఎక్కడికక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దశదిశలా వేడుకలు నిర్వహించేలా.. మంత్రులు, అధికారులు సన్నద్ధం అవుతున్నారు. సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ.. ఉత్సవాలపై అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు.

telangana formation day 2023
telangana formation day 2023

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలకు సన్నద్ధం

Telangana Decade celebrations 2023 : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు సర్కారు సన్నద్ధమైంది. కొత్త సచివాలయం ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రారంభ వేడుకలు సచివాలయంలో జరగనున్న తరుణంలో అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ సచివాలయంలో ప్రారంభించనున్నారు. జూన్ 2న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత దశాబ్ది వేడుకల సందర్భంగా సీఎం సందేశమిస్తారు. ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు.. దాదాపు 25 వేల మంది వరకు ప్రారంభ వేడుకలకు హాజరవుతారని అంచనా.

Telangana Formation Day celebrations 2023 : ఈ మేరకు అన్ని శాఖల ఉన్నతాధికారులకు సీఎస్‌ శాంతికుమారి ఆహ్వానపత్రికలు పంపారు. వేడుకలకు అనుగుణంగా సచివాలయం ముందు ఉన్న పచ్చిక బయళ్లలో.. భారీ టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్ దీపాలతో సచివాలయ భవనం, పరిసరాలను తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని.. మిషన్ భగీరథ ఇంజనీర్లు, అధికారులను ముఖ్యమంత్రి కార్యదర్శి మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆదేశించారు. జూన్ 18న నిర్వహించే మంచినీళ్ల పండుగ ఏర్పాట్లు ఘనంగా చేయాలన్నారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. అధికారులు, నాయకులు దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ములుగు జిల్లా అన్ని రంగాల్లో జరిగిన ప్రగతి చాటేలా పండగ వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని మంత్రి సత్యవతి సూచించారు. ఈ మేరకు ములుగులో.. అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. జయశంకర్ భూపాలపల్లిలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాఠోడ్ శతాబ్ది కాలంలో జరగని అభివృద్ధి.. కేవలం దశాబ్ది కాలంలోనే జరిగిందని కితాబిచ్చారు.

"తెలంగాణ ప్రజలు కేసీఆర్​ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న దగ్గర నుంచి రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. దాదాపు అన్ని రంగాల్లో దేశానికి తెలంగాణను కేసీఆర్ ఆదర్శంగా నిలిపారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటిని పరిష్కరించి.. దేశంలో నంబర్​ 1 గా నిలిపారు."- జగదీష్‌ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి

Decade celebrations of Telangana Arrangements : ప్రజలంతా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను.. పండగలా గ్రామ గ్రామాన నిర్వహించాలని మంత్రి జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమీక్షా సమావేశానికి.. హాజరయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్లు, జిల్లాలోని ఎమ్మెల్యేలు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అవతరణ దశాబ్ది ఉత్సవాలతో రాష్ట్రంలోని ప్రధాన కూడళ్లను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details