Telangana Decade Celebrations : దద్దరిల్లేలా దశాబ్ది వేడుకలు.. షెడ్యూల్​ ఇదే

author img

By

Published : May 24, 2023, 8:23 AM IST

Updated : May 24, 2023, 9:11 AM IST

Telangana Decade Celebrations

Telangana Decade Celebrations : తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ప్రతి గడపకు చేర్చేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు జరగనున్నాయి. 21 రోజుల పాటు ఆయా రంగాల్లో సాధించిన ప్రగతి, ప్రయోజనాలను వివరిస్తూ.. కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అన్ని వర్గాల ప్రజలతో క్షేత్రస్థాయిలో మమేకం అయ్యేలా వేడుకలు జరగనున్నాయి. చివరి రోజైన జూన్‌ 22న అమరులను స్మరించుకోవడంతో పాటు.. హైదరాబాద్‌లో నిర్మించిన స్మారకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరిస్తారు.

దశాబ్ది వేడుకల షెడ్యూల్​ రిలీజ్​ చేసిన సీఎం

Telangana Decade Celebrations Schedule Released : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ ఖరారైంది. జూన్ రెండో తేదీ నుంచి 22 వరకు 21 రోజులపాటు ఘనంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్సవాల రోజువారీ షెడ్యూల్‌ను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ రెండో తేదీన ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం.. సచివాలయం ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. ఆ తర్వాత సీఎం దశాబ్ది ఉత్సవ సందేశం ఇస్తారు. మరుసటి రోజు జూన్ మూడో తేదీ నుంచి జూన్‌ 22 వరకు రోజుకు ఒక రంగం చొప్పున.. ఆయా రంగాలకు చెందిన ప్రగతిని వివరించేలా కార్యక్రమాలు చేయనున్నారు.

జూన్​ 3 నుంచి జూన్​ 22 వరకు దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ :​

  • రైతు దినోత్సవం : జూన్‌ 3వ తేదీన వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల వద్ద తెలంగాణ రైతు దినోత్సవం నిర్వహించి.. ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా పథకాల విజయాలను వివరిస్తారు. రైతులందరితో కలిసి సామూహికంగా భోజనాలు చేస్తారు.
  • సురక్షా దినోత్సవం : జూన్‌ 4వ తేదీన పోలీసుశాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహిస్తారు.
  • విద్యుత్ విజయోత్సవం : జూన్ 5వ తేదీన తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం నిర్వహిస్తారు. అదే రోజున సింగరేణిలోనూ సంబురాలు జరుపుతారు.
  • పారిశ్రామిక ప్రగతి ఉత్సవం : జూన్ 6వ తేదీన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’ జరుగుతుంది.
  • సాగునీటి దినోత్సవం : జూన్‌ 7వ తేదీన సాగునీటి దినోత్సవం’’నిర్వహిస్తారు. సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో సభలు ఉంటాయి. హైదరాబాద్ రవీంద్రభారతిలో సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశం జరుగుతుంది. సమావేశంలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొంటారు.
  • చెరువుల పండగ : జూన్‌ 8వ తేదీన‘‘ఊరూరా చెరువుల పండుగ’’నిర్వహిస్తారు. కవుల పాటల్ని వినిపిస్తారు. మత్స్యకారుల వలల ఊరేగింపు, చెరువు కట్టలపై సహపంక్తి భోజనాలు ఉంటాయి.
  • సంక్షేమం సంబురాలు : జూన్‌ 9వ తేదీన తెలంగాణ సంక్షేమ సంబురాలు జరుపుతారు.
  • సుపరిపాలన దినోత్సవం : జూన్​ 10వ తేదీన తెలంగాణ సుపరిపాలన దినోత్సవం పేరిట అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు నిర్వహిస్తారు.
  • సాహిత్య దినోత్సవం : జూన్ 11వ తేదీన తెలంగాణ సాహిత్య దినోత్సవం’నిర్వహిస్తారు.
  • తెలంగాణ రన్​ : జూన్​ 12వ తేదీన తెలంగాణ రన్ నిర్వహిస్తారు.
  • మహిళా సంక్షేమ దినోత్సవం : జూన్​ 13వ తేదీన మంగళవారం తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తారు.
  • వైద్యారోగ్య దినోత్సవం : జూన్ 14వ తేదీన వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి, నిమ్స్ విస్తరణ పనులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారు.
  • పల్లె ప్రగతి దినోత్సవం : జూన్ 15వ తేదీన తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహిస్తారు.
  • పట్టణ ప్రగతి దినోత్సవం : జూన్‌ 16వ తేదీన తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం నిర్వహిస్తారు.
  • గిరిజనోత్సవం : జూన్​ 17వ తేదీన తెలంగాణ గిరిజనోత్సవం జరుపుతారు.
  • మంచినీళ్ల పండగ : జూన్​ 18వ తేదీన తెలంగాణ మంచి నీళ్ల పండగ నిర్వహిస్తారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాల నీరు ఇస్తున్న తీరును వివరిస్తారు.
  • హరితోత్సవం : జూన్‌ 19వ తేదీన తెలంగాణ హరితోత్సవం నిర్వహిస్తారు.
  • విద్యా దినోత్సవం : జూన్ 20వ తేదీన తెలంగాణ విద్యా దినోత్సవం నిర్వహిస్తారు. అదే రోజు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మన ఊరు- మన బడి పాఠశాలలను ప్రారంభిస్తారు.
  • ఆధ్యాత్మిక దినోత్సవం : జూన్‌ 21వ తేదీన తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహిస్తారు.
  • అమరవీరుల సంస్మరణ దినోత్సవం : జూన్ 22వ తేదీన అమరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. హైదరాబాదు ట్యాంక్ బండ్‌పై కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఆ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించి.. సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించే సభలో పాల్గొంటారు.

ఇవీ చదవండి :

Last Updated :May 24, 2023, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.