తెలంగాణ

telangana

National Handloom Day 2023 : నేతన్నలపై వరాల జల్లు.. ఆరోగ్యకార్డుతో పాటు ప్రతి కుటుంబానికి ఏటా రూ.25 వేలు

By

Published : Aug 6, 2023, 10:34 AM IST

National Handloom Day 2023 : రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు తీపి కబురు అందించింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని వారిపై సర్కార్ వరాల జల్లు కురిపించింది. నేతన్నలకు ఆరోగ్య కార్డులతో పాటు 10,652 మగ్గాల నవీకరణ, చేనేత సంఘాలకు డీసీసీబీల నుంచి రుణాలు, ఉప్పల్‌లో చేనేత మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

National Handloom Day
National Handloom Day

National Handloom Day 2023 : జాతీయ చేనేత దినోత్సవం(ఆగస్టు 7) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు శుభవార్త అందించింది. ప్రతి సంవత్సరం సర్కార్ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనం నిర్వహిస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఈ నెల 7 నుంచి 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలో చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సర్కార్ ఈ రంగ సమగ్రాభివృద్ధి, నేతన్నల సంక్షేమ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. మగ్గాల నవీకరణ, నేతన్నలకు ఆరోగ్యకార్డు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా ఏటా రూ.95 కోట్ల రుణం, చేనేత మ్యూజియం, కన్వెన్షన్‌ సెంటర్‌ వంటివి ఇందులో ఉన్నాయి.

Health Cards for Handloom Workers in Telangana : చేనేత, జౌళిశాఖల మంత్రి కేటీఆర్‌ఇవాళ వీటిని అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్రంలో చేనేత సమస్యలపై అధ్యయనం అనంతరం అధికారులతో కేటీఆర్‌.. సమావేశమై తొమ్మిది అంశాలపై ప్రతిపాదనలు రూపొందించారు. వాటికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదముద్ర వేశారు. చేనేత కార్మికులకు, చేనేత వృత్తి పనిచేస్తున్నవారికి నేత్ర, ఎముకలు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటికి ఆరోగ్యకార్డు ద్వారా చికిత్స అందిస్తారు. ప్రతి కుటుంబానికి ఏటా రూ.25 వేల పరిమితి మేరకు వైద్యసేవలు అందుతాయని ప్రభుత్వం పేర్కొంది. చేనేత కార్మికులకు పనిభారం, అనారోగ్య సమస్యలను నివారించేందుకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 10,652 గుంట మగ్గాల స్థానంలో నవీకరించిన ఫ్రేమ్‌ మగ్గాలను స్థాపించనున్నారు. ఒక్కో ఫ్రేమ్‌ మగ్గం ఏర్పాటుకు రూ.38వేల చొప్పున ఈ పథకానికి రూ.40.50 కోట్లను కేటాయించనుంది.

వారికి కూడా వర్తించనున్న బీమా పథకం :గత ఆగస్టు నుంచి 59 సంవత్సరాల లోపు వయసున్న వారికి నేతన్న బీమా పథకం అమలవుతుండగా ఇకపై 60 నుంచి 75 సంవత్సరాల వయసు గల వారికీ వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పోచంపల్లిలో మూతపడిన చేనేత పార్కును బ్యాంకులు వేలం వేయగా టెస్కో ద్వారా ప్రభుత్వం కొన్నది. దీనిని దేశంలోనే అతిపెద్ద చేనేత పార్కుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. చేనేత సంఘాలపై రుణభారం తగ్గించేందుకు పావలా వడ్డీ పథకం కింద 2022-23 సంవత్సరానికి రూ.2.13 కోట్ల విడుదల. నేతన్నకు చేయూత పథకం కింద కార్మికులు 8% వేతనాలను జమ చేస్తే ప్రభుత్వం దానికి 16 శాతాన్ని వారిపేరిట జమ చేస్తోంది. ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Handloom Declaration on August 7 : ఆగస్టు 7న చేనేత డిక్లరేషన్.. దిల్లీకి తరలుతున్న దేశవ్యాప్త చేనేత ప్రతినిధులు

చేనేత మ్యూజియానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్ : రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలు తమ వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీలుగా డీసీసీబీలు క్యాష్‌ క్రెడిట్‌ను అమలు చేయనున్నాయి. దీన్ని వర్కింగ్‌ క్యాపిటల్‌గా ఉపయోగించుకొని సంఘాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తాయి. దేశంలో తొలిసారిగాచేనేత మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. ఉప్పల్‌లోని శిల్పారామం వద్ద 500 గజాల స్థలాన్ని కేటాయించారు. ఇవాళ మంత్రి కేటీఆర్‌ దీనికి శంకుస్థాపన చేయనున్నారు. చేనేత వస్త్రాల వ్యాపార నిర్వహణ, క్రయవిక్రయదారుల సమావేశాలు, సదస్సుల నిర్వహణ కోసం చేనేత కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మిస్తారు. ఉప్పల్‌ భగాయత్‌లో 2,375 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.

ఆ పరిహారాన్ని రూ.25వేలకు సర్కార్ నిర్ణయం : చేనేత కార్మికులు చనిపోయిన సమయంలో టెస్కో ద్వారా అందించే పరిహారాన్ని రూ.12,500 నుంచి రూ.25 వేలకు పెంచుతున్నట్లు సర్కార్ పేర్కొంది. చేనేత మిత్ర పథకం కింద కార్మికులకు నూలు, రంగులు, రసాయనాలకు 40% మేర రాయితీని అందిస్తోంది. దీని కింద నమోదు ఇబ్బందికరంగా ఉందని కార్మికులు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తేవడంతో మార్పులు చేశారు. ఇకపై జియో ట్యాగ్‌ గల చేనేత మగ్గాలపై పనిచేసే కార్మికులకు నెలకు రూ.3,000(చేనేత కార్మికునికి రూ.2,000, అనుబంధ కార్మికులకు రూ.1,000) చొప్పున వారి ఖాతాల్లో నేరుగా బదిలీ చేయాలని నిర్ణయించారు.

చేనేత వారోత్సవాలు ఘనంగా నిర్వహిద్దాం : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ్టి నుంచి 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. మీ పరిధిలో ఉన్న నేతన్నలతో కలిసి సంబరాల్లో పాల్గొని, వారితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. హైదరాబాద్‌లోనిపీపుల్స్‌ ప్లాజాలో చేనేత వస్త్ర ఉత్పత్తుల ప్రదర్శన కొనసాగుతుంది. బీఎంఆర్‌ సార్థ ఫంక్షన్‌ హాల్‌ 7,500 మంది నేతన్నలతో రాష్ట్రస్థాయి చేనేతల సంబరాలు నిర్వహిస్తామని కేటీఆర్‌ తెలిపారు.

Pochampally silk sarees : ఉద్యోగం వదలి.. చేనేత వైపు కదిలాడు.. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు

Handloom Entrepreneur : కష్టపడితే కానిదేముందని నిరూపిస్తున్న మహిళ

KTR: 'హైదరాబాద్‌లో చేనేత మ్యూజియం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి'

ABOUT THE AUTHOR

...view details