తెలంగాణ

telangana

బురిడి కొట్టించి ఒకటి రెండు సీట్లు గెలుస్తారేమో: కవిత

By

Published : Nov 21, 2020, 7:51 PM IST

Updated : Nov 21, 2020, 8:17 PM IST

హైదరాబాద్ గాంధీనగర్ డివిజన్ కార్యకర్తల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీనగర్ తెరాస అభ్యర్థి ముఠా పద్మానరేశ్​... విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేసి పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం కల్పించారు.

బురిడి కొట్టించి ఒకటి రెండు సీట్లు గెలుస్తారేమో: కవిత
బురిడి కొట్టించి ఒకటి రెండు సీట్లు గెలుస్తారేమో: కవిత

హైదరాబాద్​లో వర్షాలు వస్తే కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. వరద సాయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తే పైసా విదల్చలేదని... అదే సమయంలో కర్ణాటక రాష్ట్రానికి మాత్రం రూ. 600 కోట్ల నిధులు వెళ్లాయని ఆక్షేపించారు.

హైదరాబాద్ ముషీరాబాద్ కషిశ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన తెరాస గాంధీనగర్ డివిజన్ కార్యకర్తల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐదేళ్లలో ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకున్నామని తెలిపారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి పథకాలు అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. భాజపా అబద్ధాలు చెబుతుందని... ఆ విషయం దేశం అంతటికీ తెలుసన్నారు. బురిడి కొట్టించి ఒకటి రెండు సీట్లు భాజపా గెలవవచ్చని జోస్యం చెప్పారు.

ప్రచారం...

గాంధీనగర్ తెరాస అభ్యర్థి ముఠా పద్మానరేశ్​... విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేసి పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ శ్రీధర్‌, మాజీ మంత్రి నేరేళ్ల ఆంజనేయులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. తొలుత... మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి చిత్రపటానికి కవిత పూలమాల వేసి నివాళులర్పించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా నాయకులు బస్తీల్లోకి ప్రచారానికి వస్తే బరాబర్ నిలదీయండి. భాజపా అబద్ధాల పుట్టలు బయటపడుతున్నాయి. అందుకే ఆ పార్టీ నాయకులు తెరాసలో చేరుతున్నారు. కరోనా వస్తే ఆ పార్టీ నాయకులు ఎక్కడ ఉన్నారు? అదే సమయంలో రోజూ పొద్దున్నే ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పోరేటర్ పద్మా నరేశ్​... కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండి ధైర్యం చెబుతూ అవసరమైన సహాయ సహకారాలు అందించారు. లక్ష్మణ్... ఆ సమయంలో ఎక్కడో ఉండి... ఇప్పుడు కనిపిస్తున్నారు.

----- కవిత, ఎమ్మెల్సీ

ఈ సందర్భంగా కవిత సమక్షంలో భాజపా, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు డివిజన్, బస్తీ నాయకులు, కార్యకర్తలు తెరాసలో చేరారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఇదీ చూడండి:'ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు హుషార్ హైదరాబాద్'

Last Updated :Nov 21, 2020, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details