ETV Bharat / state

'ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు హుషార్ హైదరాబాద్'

author img

By

Published : Nov 21, 2020, 6:55 PM IST

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కూకట్​పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ అల్లాపూర్​లో రోడ్​షోతో ప్రచార భేరీ మొదలైంది. గతంలో కూడా ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభించినట్లు మంత్రి గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ఒక్క సీటుతో సెంచరీ కోల్పోయామని... ఈసారి శతకం పూర్తి చేయాలని ఆకాంక్షించారు.

ఈసారి సెంచరీ కొట్టాల్సిందే... రోడ్​షోలో కేటీఆర్
ఈసారి సెంచరీ కొట్టాల్సిందే... రోడ్​షోలో కేటీఆర్

కొందరు అందరి హైదరాబాద్​ను కొందరి హైదరాబాద్​గా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. గ్రేటర్​ హైదరాబాద్​ కూకట్​పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ అల్లాపూర్​లో మంత్రి రోడ్​షోలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఒక్క సీటుతో సెంచరీ కోల్పోయామని... ఈసారి జీహెచ్‌ఎంసీలో తెరాస శతకం పూర్తి చేయాలని ఆకాంక్షించారు.

ఈసారి సెంచరీ కొట్టాల్సిందే... రోడ్​షోలో కేటీఆర్

ఏది కావాలో మీ ఇష్టం...

అభివృద్ధి కావాలో ఆరాచకం కావాలో ఆలోచించుకోవాలని కేటీఆర్ అన్నారు. హిందు ముస్లింలను రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారన్నారు. గడిచిన ఆరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రూ. 67వేల కోట్ల అభివృద్ధి పనులను చేపట్టిందని వివరించారు.

ఆరున్నర లక్షల మందికి వరద సహాయం అందించామని మిగిలిన వారికి కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ఆరేళ్లలో ఒక్కటంటే ఒక్కపని కూడా చేయలేదని అది కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలుసుకోవాలన్నారు.

ప్రసంగం ఆపిన మంత్రి...

ముఖ్యమంత్రి కేసీఆర్ అందరినీ కలుపుకుని వెళ్తున్నారని స్పష్టం చేశారు. ప్రశాంతమైన హైదరాబాద్ కోసం తెరాసనే గెలిపించాలని కోరారు. గతంలో కూడా ఓల్డ్ అల్లపూర్ నుంచే ప్రచారం ప్రారంభించినట్లు గుర్తు చేశారు. మసీదులో నమాజ్ సందర్భంగా కాసేపు మంత్రి ప్రసంగాన్ని ఆపారు.

రూ. 25 వేలు ఇస్త... మమ్మల్ని గెలిపిస్తే అని అంటున్నాడు ఓ పెద్దమనిషి. నేను అడుగుతున్న... ఏం ఆపింది నిన్ను? తెరాస ప్రభుత్వం నష్టపోయిన వారికి రూ. 10 వేలు ఇస్తుంటే ఆపింది ఎవరు? ఎన్నికలపుడు వచ్చి కథలు చెప్తే... వినడానికి ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు హుషార్ హైదరాబాద్.

--- రోడ్​షోలో మంత్రి కేటీఆర్

ఇవీ చూడండి: మంత్రి కేటీఆర్​తో యాంకర్​ సుమ భేటీ... ఎందుకంటే...?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.