ETV Bharat / snippets

సూర్యాపేట ఎస్పీ పేరుతో ఫేక్​ ఫేస్​బుక్​ ఖాతాలు - 'సైబర్​ కేటుగాళ్లను నమ్మి మోసపోవద్దు'

author img

By ETV Bharat Telangana Team

Published : May 29, 2024, 4:24 PM IST

Suryapet SP Rahul Hegde
Suryapet SP Facebook Fake IDs (ETV Bharat)

Suryapet SP Fake Facebook ID : ప్రముఖుల ఖాతాలు ఉపయోగించి నగదు కాజేయడం సైబర్​ నేరగాళ్లు ఇటీవల ఎక్కువగా చేస్తున్నారు. తాజాగా సూర్యాపేట ఎస్పీ రాహుల్​ హెగ్డే పేరుతో రెండు ఫేస్‌బుక్‌ నకిలీ ఖాతాలు సృష్టించి మెసేజ్​లు, ప్రెండ్​ రిక్వెస్ట్​లు పెడుతున్నారని ఆయన తెలుసుకున్నారు. దీంతో స్పందించి తన పేరుతో వచ్చిన ఖాతాలకు డబ్బులు పంపి మోసపోవద్దని తెలిపారు. తన మిత్రుడైన సంతోష్​​ అనే పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్​ఫర్ కారణంగా ఇల్లు ఖాళీ చేసి వెళుతున్నారని, అందులో ఉన్న ఫర్నిచర్ అతి తక్కువ ధరకు ఇప్పిస్తామని ఎస్పీ పేరుతో మెసేజ్ చేస్తున్నారని తెలిపారు. ఈ ఫర్నీచర్ కావాలంటే ముందుగానే డబ్బు చెల్లించాలని 9584041768 నంబర్​ తో కాల్ చేశారని అన్నారు. అనుమానం వచ్చిన ఓ ఖాతాదారుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.