తెలంగాణ

telangana

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపై దృష్టి సారించిన కాంగ్రెస్

By

Published : Oct 9, 2022, 3:17 PM IST

Updated : Oct 9, 2022, 4:24 PM IST

Congress Focused Munugode Bypoll: హైదరాబాద్​లో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం ముగిసింది. ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపై నేతలతో చర్చించామని రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్య నేతలంతా మునుగోడుపై దృష్టి సారించారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ భేటీలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.

Congress focused on munugode by elections
Congress focused on munugode by elections

Congress Focused Munugode Bypoll: హైదరాబాద్​లో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం ముగిసింది. ఈ భేటీలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపై నేతలతో చర్చించామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నేటి నుంచి ఈనెల 14 వరకు ముఖ్యనేతలు ప్రచారంలోనే ఉంటారని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మునుగోడులో ప్రచారానికి వస్తారని రేవంత్ స్పష్టం చేశారు.

భారత్‌ జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణలోకి ప్రవేశిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో రాహుల్‌గాంధీ పాల్గొంటారని తెలిపారు. రెండు రోజుల్లో పాదయాత్ర రూట్ మ్యాప్‌పై స్పష్టత ఇస్తామని తెలియజేశారు. భాజపా, తెరాస మధ్య మిత్ర భేదమే తప్పా.. శత్రు భేదం లేదని ఆరోపించారు. వాటాల పంపకంలోనే తెరాస, భాజపా మధ్య పంచాయతీ నడుస్తోందని విమర్శించారు. గులాబీ వసూళ్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మునుగోడు ఉప ఎన్నికపైనే ప్రధానంగా చర్చ జరిగిందని ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. మునుగోడులో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ కాంగ్రెస్ ఎంపీలపై చేసిన వ్యాఖ్యలు నిరాధారణమైనవని తెలిపారు. కాంగ్రెస్‌లో కోవర్టులు ఎవరు లేరని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడులో ఎలాంటి వ్యూహం అవలంభించాలనేదానిపై చర్చించామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. ముఖ్య నేతలంతా మునుగోడుపై దృష్టి సారించారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపై దృష్టి సారించిన కాంగ్రెస్

"బహిరగంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రజాప్రతినిధులను సంతలో పశువులకంటే కూడా హీనంగా కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రజలే ప్రత్యక్ష కార్యచరణకు దిగితే తప్ప ఇలాంటి ఆరాచక పార్టీలకు గుణపాఠం చెప్పలేము. ఒకరు రూ.30వేలు ఇస్తామంటే మరొకరు రూ.40వేలు ఇస్తామంటున్నారు. అసలు ఏం కార్యాచరణ. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వమంటే అణాపైసా తెచ్చే పరిస్థితి లేదు. నిధుల విడుదల చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం పని చేయడం లేదు కానీ ఓట్లు కొనుగోలు చేయడానికి, నాయకులను కొనుగోలు చేయడానికి వందల కోట్లు పెడతామని ముందుకొస్తున్నారు. అంటే వీళ్లకి వాళ్ల పార్టీ సిద్ధాంతాల మీద ,వాళ్లు చేసిన అభివృద్ధి మీద నమ్మకం లేదు." - రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:మునుగోడులో స్పీడ్​ పెంచిన ప్రధాన పార్టీలు.. ప్రచారంలోకి అగ్రనేతలు..!

బనారస్ కళాశాలలో బూత వైద్యం నేర్పించే చరిత్ర భాజపాది: హరీశ్‌రావు

దిల్లీలో దంచికొడుతున్న వాన.. దశాబ్దంలోనే రికార్డు స్థాయి వర్షపాతం

Last Updated : Oct 9, 2022, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details