తెలంగాణ

telangana

తెలంగాణ నుంచి ఎగుమతులు రూ.1.83 లక్షల కోట్లకు చేరాయి: మంత్రి కేటీఆర్

By

Published : Nov 12, 2022, 6:19 PM IST

KTR Attend Indian Industry Meeting: చెన్నై, ముంబయి, కోల్‌కతా వంటి నగరాలతో పోల్చుకుంటే.. హైదరాబాద్‌లో జీవనం ఎంతో సులభతరమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదరన్​ రీజనల్​ కౌన్సిల్​ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో వ్యాపార సంబంధాలను బలపరిచే నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆంధ్రా, కర్ణాటక, కేరళ, పుదుచెర్రి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇండియన్ ఇండస్ట్రీ సమావేశంలో పాల్లొన్న: కేటీఆర్​
ఇండియన్ ఇండస్ట్రీ సమావేశంలో పాల్లొన్న: కేటీఆర్​

చెన్నై, ముంబయి, కోల్‌కతా వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో జీవనం ఎంతో సులభమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. భాగ్యనగరంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సదరన్‌ రీజనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో వ్యాపార సంబంధాలను బలపరిచే నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఆంధ్రా, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు.

2014లో తెలంగాణ నుంచి రూ.57 వేల కోట్లు ఎగుమతులు ఉండేవని.. ప్రస్తుతం రూ.1.83 లక్షల కోట్లకు చేరాయని కేటీఆర్‌ తెలిపారు. భారీగా ఉత్పత్తి చేసే దేశాలైన చైనా, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలతో భారత్‌ ఎలా పోటీ పడాలనే అంశంపై సీఐఐ సమగ్రంగా చర్చించాలని సూచించారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ హైదరాబాద్‌కు రాబోతోంది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్‌ క్యాంపస్‌ హైదరాబాద్‌లోనే ఉంది. విప్రో, సేల్స్ ఫోర్స్‌, మెటా, ఉబర్‌ వంటి పెద్ద పెద్ద సంస్థల రెండో అతి పెద్ద క్యాంపస్‌లు కూడా ఇక్కడే ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి ఇది ఒక చిహ్నం. ఏరోస్పేస్‌ రంగంలో కూడా తెలంగాణ దూసుకెళ్తోంది. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన హైదరాబాద్‌లో దేశంలోని ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారైనా జీవించే సౌకర్యాలున్నాయి’’ అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details