తెలంగాణ

telangana

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నిందితుల బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

By

Published : Nov 14, 2022, 11:26 AM IST

Updated : Nov 14, 2022, 5:09 PM IST

MLAs Poaching Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసులో అరెస్టు అయిన ముగ్గురు నిందుతుల బెయిల్​ పిటిషన్​పై అ.ని.శా. కోర్టు విచారణ చేపట్టింది. దర్యాప్తు వేళ బెయిల్‌ ఇస్తే ఆటంకం ఎదురవుతుందన్న పోలీసుల తరఫు న్యాయవాదితో ఏకీభవించిన కోర్టు.. నిందితుల బెయిల్​ పిటిషన్​ను కొట్టివేసింది.

MLA purchase case
MLA purchase case

MLAs Poaching Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి నాంపల్లి ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించింది. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలకు బెయిల్ ఇవ్వాలంటూ నిందితుల తరఫు న్యాయవాది వేసిన బెయిల్ పిటిషన్​ను కోర్టు కొట్టేసింది. నిందితులకు బెయిల్ ఇస్తే దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తారని, సాక్షులను ప్రభావితం చేస్తారన్న పోలీసుల తరఫు న్యాయవాది వాదనతో ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏకీభవించింది. నిందితుల వెనక చాలా పెద్ద వ్యక్తులున్నారని, ఇప్పటి వరకు ఏఏ మోసాలకు పాల్పడ్డారనే విషయాలు తెలుసుకోవాల్సి ఉందని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఇప్పటికే రెండు రోజుల కస్టడీ ముగిసిందని.. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్.. ఈ కేసులో చేర్చడం తగదని.. ఫామ్​హౌస్​లో ఎక్కడా డబ్బులు లభించలేదని నిందితుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఏసీబీ ప్రత్యేక కోర్టు మాత్రం బెయిల్ ఇవ్వడానికి అంగీకరించలేదు. ముగ్గురు నిందితులు ప్రస్తుతం చంచల్​గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

రేపటికి వాయిదా..: మరోవైపు ఈ కేసు దర్యాప్తుపై విధించిన స్టేను ఎత్తివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ భాజపా నేత ప్రేమేందర్​రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్​పై విచారణ రేపటికి వాయిదా పడింది. స్టేను యధావిధిగా కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రేమేందర్​రెడ్డి.. శనివారం హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని పిటిషన్​లో కోరారు. ఈ కేసును అత్యవసరంగా విచారణ చేయాలని ప్రేమేందర్​ తరఫు న్యాయవాది కోరగా.. కోర్టు రేపటికి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 14, 2022, 5:09 PM IST

ABOUT THE AUTHOR

...view details