తెలంగాణ

telangana

మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో కేంద్ర జీఎస్‌టీ సోదాలు

By

Published : Dec 12, 2022, 1:51 PM IST

Updated : Dec 12, 2022, 2:26 PM IST

IT RAIDS IN MITHRI
IT RAIDS IN MITHRI

13:49 December 12

మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఉదయం నుంచి కేంద్ర జీఎస్టీ సోదాలు

Central GST Searches in Mythri Movie Makers: ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థపై కేంద్ర జీఎస్‌టీ అధికారులు దాడులు చేశారు. ఏకకాలంలో 15 చోట్ల జీఎస్​టీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, సిబ్బందికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలలో కేంద్ర జీఎస్‌టీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

నిర్మాతలు నవీన్ యర్నేని, రవిశంకర్ ఇళ్లు, కార్యాలయంలో కేంద్ర జీఎస్‌టీ సోదాలు చేస్తోంది. లావాదేవీలు, ఆదాయ పన్ను చెల్లింపులపై ఆరా తీస్తున్నారు. అగ్ర హీరోలు, భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ వరుస సినిమాలను నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణాలకు సంబంధించిన పన్ను చెల్లింపులు, తదితర అంశాలపై వివిధ పత్రాలను కేంద్ర జీఎస్టీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ గతంలో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌, రంగస్థలం, సర్కారు వారి పాట, పుష్ప ది రైజ్‌ చిత్రాలను నిర్మించింది. ప్రస్తుతం ఆ సంస్థే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలను నిర్మిస్తోంది. సంక్రాంతికి ఆ రెండు సినిమాలు విడుదల కానున్నాయి. నిన్న ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రారంభించింది. అల్లు అర్జున్‌తో పుష్ప చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్.. ఇవాళ్టి నుంచి పుష్ప-2 చిత్రీకరణ మొదలుపెట్టింది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 12, 2022, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details