తెలంగాణ

telangana

కృష్ణా, గోదావరి నదుల్లో మళ్లీ వరద, ప్రాజెక్టులకు పోటెత్తుతోన్న ప్రవాహం

By

Published : Aug 17, 2022, 10:46 AM IST

Updated : Aug 18, 2022, 12:05 PM IST

Huge Inflow to Projects కృష్ణా, గోదావరి నదుల్లో వరద మళ్లీ పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న నీటితో కాళేశ్వరం, భద్రాచలం వద్ద ప్రవాహం పోటెత్తుతోంది. ఇప్పటికే జలాశాయలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరటంతో గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

Huge Inflow to Projects
Huge Inflow to Projects

Huge Inflow to Nagarjuna sagar Projects నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 3 లక్షల 89 వేల 757 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో 24 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి 3 లక్షల 41 వేల 280 క్యూసెక్కులు స్పిల్‌వే గుండా దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 29 వేల 232 క్యూసెక్కులు....సాగర్ కుడి,ఎడమ కాల్వలకు 17 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. SLBCకి 1800 క్యూసెక్కులు, లెవెల్ కాల్వకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఔట్‌ఫ్లో 3 లక్షల 89 వేల 757 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగలకుగాను... ప్రస్తుతం 586 అడుగుల నీరు నిల్వ ఉంది.

Huge Inflow to Projects జూరాల జలాశయానికి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టుకు 2 లక్షల 50 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా... 44 గేట్లు ఎత్తి 2 లక్షల 44 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 8.3 TMCలుగా ఉంది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. లక్ష్మి బ్యారేజీ 85 గేట్లు ఎత్తి 9 లక్షల 89 వేల 630 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. సరస్వతి బ్యారేజీ 66 గేట్లు ఎత్తి లక్షా 7 వేల 320 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. పుష్కర ఘాట్ వద్ద 12.14 మీటర్ల ఎత్తులో ఉభయ నదులు ఉప్పొంగుతున్నాయి. సమీపంలోని చిరు దుకాణాలను ప్రవాహం ముంచెత్తింది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో ఉద్ధృతి కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరించారు.

భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమగా పెరుగుతోంది. ప్రస్తుతం 54.6 అడుగులకు చేరుకుంది. 15 లక్షల 8 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. నిన్న రాత్రి 8 గంటలకు గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరడంతో అధికారులు.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కూనవరం, V.R.పురం, చింతూరు, వేలేరుపాడు, కుకునూరు మండలాలు జలదిగ్బంధం అయ్యాయి. వారం రోజుల నుంచి ఆయా మండలాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు భద్రాచలం నుంచి చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్లే రహదారులపైకి వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ఇదీ చూడండి: పెరుగుతున్న గోదావరి నీటిమట్టం, మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Last Updated :Aug 18, 2022, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details