తెలంగాణ

telangana

TS Inter exams : ఇంటర్‌ వార్షిక పరీక్షల తేదీల్లో మార్పులు..!

By

Published : Nov 17, 2021, 8:28 AM IST

ఇంటర్మీడియట్‌ పరీక్షల(Intermediate exams) కాలపట్టిక మారే అవకాశం ఉంది. ఇటీవల ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు జరగడం, జవాబుపత్రాల మూల్యాంకనం కారణంగా కొద్ది రోజులపాటు తరగతులు జరగలేదు. దీంతో సిలబస్‌ పూర్తికాదని భావిస్తున్న ఇంటర్‌బోర్డు గతంలో ప్రకటించిన వార్షిక పరీక్షల కాలపట్టికలో మార్పులు చేయనుందని సమాచారం.

intermediate exams
intermediate exams

ఇంటర్మీడియట్‌ పరీక్షల(Intermediate exams) కాలపట్టిక మారే అవకాశం ఉంది. వచ్చే మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 14 వరకు వార్షిక పరీక్షలు జరుపుతామని గత సెప్టెంబరులో విడుదల చేసిన విద్యా క్యాలెండర్‌లో ఇంటర్‌బోర్డు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు జరగడం, జవాబుపత్రాల మూల్యాంకనం కారణంగా కొద్ది రోజులపాటు తరగతులు జరగలేదు. ఈ క్రమంలో సిలబస్‌ పూర్తికాదని భావిస్తున్న ఇంటర్‌బోర్డు గతంలో ప్రకటించిన వార్షిక పరీక్షల కాలపట్టికలో మార్పులు చేయనుందని సమాచారం. మార్చికి బదులు ఏప్రిల్‌ నెలాఖరులో పరీక్షలు మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఇంటర్‌ పరీక్షల(Intermediate exams) ఫలితాలను ఈనెలాఖరులో వెల్లడించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మూల్యాంకనాన్ని మరో మూడు నాలుగు రోజుల్లో పూర్తి చేసి నెలాఖరులో ఫలితాలు ఇవ్వాలని భావిస్తున్నారు.

రికార్డులకు ఎక్కని 70 వేల మంది విద్యార్థులు...

ఈ ఏడాది 1570 ప్రైవేట్‌ కళాశాలలు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్‌)నకు దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు 1269 కళాశాలలకు అనుమతి దక్కింది. మిగిలిన 301 కళాశాలలకు అనుమతిపై ఇంటర్‌బోర్డు(telangana intermediate board) తాత్సారం చేస్తోంది. ఈ కళాశాలల్లో దాదాపు 70 వేల మంది ప్రవేశాలు పొందారు. ఇవన్నీ వాణిజ్య, గృహ సముదాయాల్లో (మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ) నడుస్తున్నాయి. నిబంధనల ప్రకారం వాటికి అగ్నిమాపకశాఖ నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం(ఎన్‌ఓసీ) అవసరం. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ విద్యా సంవత్సరానికి ఎన్‌ఓసీ నుంచి అగ్నిమాపకశాఖ మినహాయింపు ఇచ్చింది. దానిపై గత నెల 5న జీఓ 95 జారీ చేసింది. ఈ ఉత్తర్వు ఇచ్చి 40 రోజులు దాటినా ఇంకా ఈ కళాశాలలు అనుబంధ గుర్తింపునకు నోచుకోలేదు.

ఆ విద్యార్థులు చేరనట్టే..

అఫిలియేషన్‌ ఉన్న కళాశాలలకు ఇంటర్‌బోర్డు(telangana intermediate board) ఆన్‌లైన్‌లో ప్రవేశాల లాగిన్‌ ఇస్తుంది. ప్రవేశాలు పొందిన విద్యార్థుల పేర్లను అందులో నమోదు చేసి బోర్డుకు పంపిస్తారు. వీరు మాత్రమే పరీక్ష రుసుములు చెల్లించేందుకు అర్హులు. గుర్తింపు లేని కళాశాలల్లో చేరిన విద్యార్థులు ప్రభుత్వ దృష్టిలో చేరనట్టే. చివరికి వీరి పరిస్థితి గందరగోళంగా తయారవుతుంది. ఈ 301 కళాశాలలకు అనుమతులు జిల్లా ఇంటర్‌ విద్యాశాఖల్లో, బోర్డులోని వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రథమ సంవత్సరం పరీక్షలు, మూల్యాంకనం కారణంగా అనుమతుల్లో జాప్యమైందని బోర్డు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే ఈ గుర్తింపుతో పాటు ఏ ప్రక్రియను కూడా బోర్డు సకాలంలో పూర్తి చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

ఇదీ చదవండి:TS Cabinet Ministers: రాష్ట్ర కేబినెట్​లో కీలక మార్పులు.. కొత్త మంత్రులు వీళ్లే..!

ABOUT THE AUTHOR

...view details