తెలంగాణ

telangana

'నా సమస్యను ప్రధానితోనే చెప్పుకుంటా'.. ఇల్లెందు నుంచి దిల్లీకి వెళ్తున్న యువకుడు

By

Published : Dec 5, 2021, 4:42 PM IST

న్యాయం కోసం ఓ యువకుడు ద్విచక్రవాహనంపై దిల్లీకి బయలుదేరాడు. తన సమస్యను ప్రధాని మోదీని కలిసి వివరిస్తానని... ఒకవేళ కలవడం కుదరకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు సింగరేణి నిర్వాసిత కుటుంబానికి చెందిన యువకుడు.

delhi tour
delhi tour

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన సుందర్ కుటుంబం... ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో ఉపరితల గని విస్తరణ సందర్భంగా భూమిని కోల్పోయింది. వారికి సింగరేణి సంస్థ నుంచి పరిహారం అందలేదు. ఈ విషయమై ప్రజాప్రతినిధుకు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదు. దీనిపై సుందర్​ ఐదేళ్లుగా పలు విధాలుగా నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నాడు.

ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట సుందర్​.. సెల్​టవర్​ ఎక్కి హల్​చల్​ చేశాడు. అధికారులు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో దిగి వచ్చాడు. ఆర్డీవో, సింగరేణి, పోలీస్​, రెవెన్యూ అధికారులు అతని సమస్యను పరిశీలిస్తామని హామీ ఇచ్చి కిందకి దింపారు. అయినప్పటికీ పరిష్కారం లభించలేదు. సుందర్​.. గతంలో సీఎం కేసీఆర్​ను కలిసేందుకు ప్రయత్నించాడు. అతడిని అడ్డుకున్న పోలీసులు కౌన్సిలింగ్​ ఇచ్చి పంపేశారు.

తండ్రి బాధను అర్థం చేసుకున్న అతని కుమారుడు సంజయ్​.. తమ కుటుంబ కష్టాన్ని పీఎం మోదీకి వివరిస్తానంటూ దిల్లీకి పయనమయ్యాడు. నవంబర్​ 29న ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. తన ప్రయాణానికి సంబంధించి ఒక వీడియో పెట్టాడు. దిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు.. తమ సమస్యను ప్రధానికి విన్నవిస్తానని అంటున్నాడు ఆ యువకుడు. ఒకవేళ ప్రధానిని కలిసే అవకాశం రాకపోతే అక్కడే ఆత్మహత్య చేసుకుంటానంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో పెట్టాడు.

'నా సమస్యను ప్రధానితోనే చెప్పుకుంటా'.. ఇల్లెందు నుంచి దిల్లీకి వెళ్తున్న యువకుడు

ఇదీ చూడండి:KTR Tweet Today : కందికొండ కుమార్తె ట్వీట్‌కు కేటీఆర్ స్పందన

ABOUT THE AUTHOR

...view details