తెలంగాణ

telangana

IPL 2023 : బెంగళూరుతో మ్యాచ్​.. టాస్​ గెలిచిన దిల్లీ.. బోణీ కొట్టేనా?

By

Published : Apr 15, 2023, 3:04 PM IST

Updated : Apr 15, 2023, 3:28 PM IST

ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా బెంగళూరు, దిల్లీ జట్ల మధ్య మ్యాచ్​ ప్రారంభమైంది. అందులో భాగంగా టాస్​ ఎవరు గెలిచారంటే?

Royal Challengers Bangalore vs Delhi Capitals toss
Royal Challengers Bangalore vs Delhi Capitals toss

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 16వ సీజన్​లో భాగంగా.. బెంగళూరు, దిల్లీ జట్ల మధ్య మ్యాచ్​ ప్రారంభమైంది. అందులో భాగంగా దిల్లీ టాస్​ గెలిచి.. బౌలింగ్​ ఎంచుకుంది. ప్రత్యర్థి బెంగళూరుకు బ్యాటింగ్ అప్పగించింది. అయితే, ఈ సీజన్​లో దిల్లీ, ఆర్​సీబీ పేలవ ప్రదర్శన చేస్తున్నాయి. అయితే, ఆర్​సీబీ జట్టు ఇప్పటివరకు మూడో మ్యాచ్​లు ఆడి.. రెండింట్లో బోల్తా కొట్టింది. ఇక, దిల్లీ ఆడిన నాలుగు మ్యాచ్​ల్లోనూ ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో బెంగళూరు 7వ స్థానంలో, దిల్లీ చివరి ప్లేస్​లో నిలిచాయి.

తుదిజట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), వనిందు హసరంగ, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌ కుమార్ వైషాక్.

దిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్ (వికెట్‌ కీపర్‌), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జ్​, ముస్తాఫిజుర్ రెహమాన్.

దిల్లీ ఇంపాక్ట్‌ ప్లేయర్ల ఆప్షన్స్
పృథ్వీ షా, ముకేశ్‌ కుమార్, ప్రవీణ్‌ దూబే, సర్ఫరాజ్‌ ఖాన్, చేతన్ సకారియా

ఆర్‌సీబీ సబ్‌స్టిట్యూట్‌లు
సుయాశ్‌ ప్రభుదేశాయ్‌, డేవిడ్ విల్లే, ఆకాశ్ దీప్, కర్ణ్ శర్మ, అనుజ్‌ రావత్

అయితే ఆర్సీబీ స్టార్​ బ్యాటర్​ విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడటంతోపాటు నిలకడగా పరుగులు సాధించడం తెలిసిన క్రికెటర్. చివరి వరకూ క్రీజ్‌లో నిలబడి ఎన్నోసార్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌ 16వ సీజన్‌లోనూ రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న విరాట్.. మూడు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలతో 164 పరుగులు చేశాడు. అయితే తక్కువ స్ట్రైక్‌రేట్‌తో ఆడటంపై ఇటీవల ఓ కామెంటేటర్‌ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై 44 బంతుల్లో 61 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌ సందర్భంగానే కివీస్‌ మాజీ క్రికెటర్‌ సైమన్ డౌల్‌ విరాట్ స్ట్రైక్‌రేట్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఆ వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ స్పందించాడు. "ఒక్కోసారి మ్యాచ్‌లో యాంకర్ పాత్ర పోషించాల్సి ఉంటుంది. దానిని పూర్తిగా అంగీకరిస్తా. అయితే, బయట ఉండే కొంతమందికి మాత్రం అక్కడి పరిస్థితి తెలియదు. వారు గేమ్‌ను విభిన్నంగా చూస్తుంటారు. పవర్‌ ప్లే ఓవర్లు ముగిసిన తర్వాత 'ఓకే.. ఇక వీరు స్ట్రైక్‌ను రొటేట్ చేస్తారు. దూకుడుగా ఆడరులే' అని వారు అనుకుంటారు. ఒకవేళ పవర్‌ప్లేలో వికెట్‌ పడకపోతే.. టాప్‌ బౌలర్‌ రంగంలోకి వస్తాడు. అతడు వేసే తొలి ఓవర్‌ను గమనించాల్సి ఉంటుంది. దాని కోసం స్ట్రైక్‌రేట్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ప్రత్యర్థి బౌలింగ్‌ను అర్థం చేసుకుంటే మిగతా ఓవర్లను సులువుగా ఆడేయచ్చు" అని విరాట్ చెప్పాడు.

Last Updated :Apr 15, 2023, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details