తెలంగాణ

telangana

IPL 2022: మెగా వేలంలో ఈ స్టార్ క్రికెటర్లు ఎన్ని రూ.కోట్లు పలుకుతారో?

By

Published : Dec 1, 2021, 1:09 PM IST

IPL Retention 2022: రిటెన్షన్​ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో కేఎల్​ రాహుల్, హార్దిక్​ పాండ్య, శ్రేయస్​ అయ్యర్​, రషీద్​ ఖాన్​, డేవిడ్​ వార్నర్​ వంటి స్టార్​ ప్లేయర్స్​ మెగావేలంలో అందుబాటులో ఉండనున్నారు. వీరిని దక్కించుకునేందుకు ఇతర ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. మరి వీరు ఏ జట్టుకు ఆడే అవకాశం ఉంది? మెగావేలంలో ఎన్ని కోట్లు పలుకుతారో?

Kl rahul, rashid khan, IPL mega auction, ఐపీఎల్​ మెగావేలం, కేఎల్​ రాహుల్​, రషీద్​ ఖాన్​
మెగావేలంలోకి స్టార్స్

IPL 2021 retained players: వచ్చే ఐపీఎల్​ సీజన్​ను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది(bcci ipl). అందులో భాగంగా రిటెన్షన్‌(ipl retention) ప్రక్రియ నవంబరు 30న జరిగింది. ప్రస్తుతం ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలకు నలుగురేసి ఆటగాళ్లను(ipl retention list) అట్టిపెట్టుకునే అవకాశం ఉండగా అన్నీ టీమ్స్​ కలిపి 27మంది ఆటగాళ్లను రిటెయిన్​ చేసుకున్నారు. ముంబయి, చెన్నై, దిల్లీ, కోల్‌కతా నలుగురేసి.. బెంగళూరు, హైదరాబాద్‌, రాజస్థాన్‌ ముగ్గురేసి ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. పంజాబ్‌ కింగ్స్‌ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటెయిన్‌ చేసుకుంది. దీంతో కేఎల్​ రాహుల్, హార్దిక్​ పాండ్య, శ్రేయస్​ అయ్యర్​, రషీద్​ ఖాన్​, డేవిడ్​ వార్నర్​ వంటి స్టార్​ ప్లేయర్స్​ మెగావేలంలో అందుబాటులో ఉండనున్నారు. ఇప్పుడు వారిని దక్కించుకునేందుకు ఇతర ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆటగాళ్ల ఐపీఎల్​ స్టాట్స్​ ఏంటి? ఎంత ధర పలికే అవకాశం ఉంది? ఏ జట్లు వారిని దక్కించుకుంటాయి? సహా పలు విషయాల సమాహారమే ఈ కథనం..

కేఎల్​ రాహుల్​..

punjab kings retained players: పంజాబ్​ కింగ్స్​.. మయాంక్​ అగర్వాల్(రూ.12కోట్లు)​, అర్ష్​దీప్​ సింగ్​ను(రూ.4కోట్లు) అట్టిపెట్టుకుంది. రాహుల్​ రిటెయిన్ చేసుకోకపోవడానికి కారణాలు తెలియరాలేదు. రాహుల్‌ వ్యక్తిగతంగా రాణించినా.. జట్టును నడపడంలో విఫలమయ్యాడని పంజాబ్ కింగ్స్‌ ఫ్రాంచైజీ(punjab kings xi team) భావించిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే కొత్త ఫ్రాంచైజీ లఖ్​నవూకు అతడు సారథ్యం వహించే అవకాశం ఉందని తెలిసింది. బీసీసీఐ నిబంధన ప్రకారం కొత్త ఫ్రాంచైజీలు.. తమ జట్లకు ఎంపికయ్యే కెప్టెన్లకు రూ.15కోట్లు మించి ఖర్చు చేయరాదు. కాబట్టి రాహుల్​ కెప్టెన్​గా ఎంపిక అయితే అతడి ధర రూ.15కోట్లు ఉంటుంది. ఈ మెగాలీగ్​లో ఇప్పటివరకు అతడికి 94 మ్యాచ్​లు(3,273 పరుగులు) ఆడిన అనుభవం ఉంది. అందులో రెండు సెంచరీలు, 27 ​ అర్ధశతకాలు ఉన్నాయి.

మెగావేలంలోకి కేఎల్​ రాహుల్​

శిఖర్​ ధావన్​

shikhar dhawan ipl 2021: ఐపీఎల్​ చరిత్రలో అత్యధిక పరుగులు(5,784) చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు శిఖర్​ ధావన్​. పంత్​(రు.16 కోట్లు), అక్సర్​ పటేల్(రూ.9కోట్లు)​, పృథ్వీ షా(రూ.7.50కోట్లు), నోర్జేను(రూ.6.50 కోట్లు) అట్టిపెట్టుకున్న దిల్లీ క్యాపిటల్స్​ ధావన్​ను రిలీజ్​ చేసింది. ఇతడు ఇప్పటివరకు మెగాలీగ్​లో 192 మ్యాచ్​లు ఆడాడు. మరి ఇతడిని ఇదే జట్టు మెగావేలంలో కొనుగోలు చేస్తుందో లేదో చూడాలి.

శ్రేయస్​ అయ్యర్​

shreyas iyer retention: శ్రేయస్​ అయ్యర్​ను కూడా దిల్లీ క్యాపిటల్స్​ రిటైన్​ చేయలేదు. గతంలో ఈ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించాడు అయ్యర్​. ఐపీఎల్​లో 87 మ్యాచ్​లుశ్(2,375) మ్యాచ్​లు ఆడాడు. అందులో 16 అర్ధశతకాలు ఉన్నాయి. ప్రస్తుతం రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, రాజస్థాన్​ రాయల్స్​ సహా కొత్త జట్లకు కొత్త కెప్టెన్ల అవసరం ఉంది. కాబట్టి వీటిలో ఏదో ఓ జట్టుకు అతడు సారథిగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి ఇతడిని రూ.10 కోట్ల నుంచి రూ.15కోట్ల మధ్యలో తీసుకోవచ్చు.

మెగావేలంలోకి శ్రేయస్​ అయ్యర్​

రవిచంద్రన్​ అశ్విన్​

ravichandran ashwin ipl: సీనియర్​ ఆఫ్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ను కూడా దిల్లీ క్యాపిటల్స్​ రిలీజ్​ చేసింది. గత సీజన్​లో ఇతడు 13 మ్యాచ్​లు ఆడి ఏడు వికెట్లు తీశాడు. అయితే మెగావేలంలో మళ్లీ ఇతడిని రూ.కోటి లేదా రూ.2కోట్లకు దిల్లీనే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

వార్నర్​

david warner ipl 2021 team: గత సీజన్​లో పేలవమైన ప్రదర్శనతో కెప్టెన్సీ సహా జట్టులో చోటు కోల్పోయాడు సన్​రైజర్స్​ హైదరాబాద్​కు ప్రాతినిధ్యం వహించిన స్టార్​ ప్లేయర్​ వార్నర్​. దీంతో సదరు ఫ్రాంచైజీ ఈ సారి రిటెయిన్​ చేసుకోలేదు. ఇతడు రానున్న కొత్త జట్లలో ఒకదానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. ఇతడి ధర రూ.7కోట్ల నుంచి రూ.15కోట్లు పలకొచ్చు. ఇప్పటివరకు మెగాలీగ్​లో 150 మ్యాచ్​లు ఆడిన వార్నర్​ 5,449 పరుగులు చేశాడు. అందులో నాలుగు సెంచరీలు, 50 అర్ధ శతకాలు ఉన్నాయి.

మెగావేలంలోకి వార్నర్​

రషీద్​ ఖాన్​

rashid khan ipl price 2021: అఫ్గానిస్థాన్​ స్పిన్నర్​ రషీద్​ ఖాన్​ను విడుదల చేసింది సన్​రైజర్స్​ హైదరాబాద్​. ఇప్పడతడు వేలంలోకి రానున్నాడు. కాగా, అతడు కూడా కొత్త జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడని తెలిసింది. రూ.5కోట్లు లేదా రూ.6కోట్లను ఇతడిని తీసుకోవచ్చు.

మెగావేలంలోకి రషీద్​ ఖాన్​

పాండ్య బ్రదర్స్

hardik pandya ipl 2021: ఐపీఎల్​ చరిత్రలో అత్యధికంగా ఐదు సార్లు ట్రోఫి నెగ్గిన ముంబయి ఇండియన్స్​ హార్దిక్​ పాండ్య, కృనాల్​ పాండ్యను రిలీజ్​ చేసింది. ఈ అన్నదమ్ములు గత కొద్ది కాలంగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోతున్నారు. ముంబయి.. మెగావేలంలోనూ వీరిని తీసుకునేది అనుమానమే. ఒకవేళ ముంబయి లేదా ఇతర జట్లు వీరిపై ఆసక్తి చూపితే రూ.2కోట్లు లేదా రూ.3కోట్లకు కొనుగోలు చేస్తాయి.

మెగావేలంలోకి హార్దిక్​ పాండ్య

రూ.33కోట్లు మించరాదు

కాగా, కొత్త ఫ్రాంచైజీలకు రిటెన్షన్​ పద్ధతి లేదు కనుక.. మెగావేలానికి ముందు తమ కొత్త ఆటగాళ్లను ఎంచుకుంటారు. ఈ టీమ్స్​కు ముగ్గురు ప్లేయర్స్​ను తీసుకనే అవకాశం ఉంది. వారిలో ఇద్దరు స్వదేశీ, ఒకరు విదేశీ ఆటగాడు ఉంటాడు. అయితే ఈ ఫ్రాంచైజీలకు ఉన్న రూ.90కోట్ల పర్సులో కేవలం రూ.33 కోట్లు మాత్రమే ఖర్చు చేయాలని బీసీసీఐ నిబంధన విధించింది. ఈ నిబంధన ప్రకారం తొలి ప్రాధాన్య ఆటగాడికి రూ.15కోట్లు, రెండు, మూడు ప్లేయర్స్​కు రూ.11కోట్లు, రూ.7కోట్లు వెచ్చించాలి. ఈ కొత్త జట్లకు కెప్టెన్​గా ఎంపిక చేసిన వారికి రూ.15కోట్లు కంటే ఎక్కువగా ఖర్చు చేయకూడదు. కాగా, కేఎల్​ రాహుల్​, వార్నర్​, శ్రేయస్​.. వీరిలో ఎవరైనా ఇద్దరు ఈ కొత్త టీమ్స్​కు సారథులుగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి వీరికి రూ.15కోట్లు మించి రావు.

ఇదీ చూడండి: ఐపీఎల్ రిటెన్షన్ పూర్తి జాబితా వచ్చేసింది.. ఎవరికి అత్యధిక ధరంటే?

ABOUT THE AUTHOR

...view details