తెలంగాణ

telangana

ఐపీఎల్: వీరి ధర చాలా ఎక్కువ గురూ!

By

Published : Feb 2, 2021, 10:09 AM IST

ఐపీఎల్​ వేలంలో విదేశీ ఆటగాళ్లకు భారీ డిమాండ్​ ఉంటుంది. వారిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి కనబర్చడం వల్ల ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్​ చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకున్న విదేశీ ఆటగాళ్లెవరో చూద్దాం.

Most expensive overseas picks in the history of IPL auctions
ఐపీఎల్​ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాళ్లు

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) ప్రారంభం నుంచి జరుగుతోన్న వేలంలో విదేశీ ఆటగాళ్లకు ఎప్పుడూ డిమాండ్​ ఉంటుంది. ఆండ్రూ ఫ్లింటాఫ్​, కెవిన్​ పీటర్సన్​ వంటి స్టార్ క్రికెటర్లు తొలి సీజన్​ వేలంలో భారీ ధర పలికారు. అలాగే ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​ స్టోక్స్​ మాత్రం ఐపీఎల్​ వేలంలో ప్రవేశించినప్పటి నుంచే భారీ డిమాండ్​తో ఇప్పటికీ కొనసాగుతున్నాడు.

వేలంలో అత్యధిక రేటుకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాళ్లందరూ నిలకడగా కొనసాగిన సందర్భాలు కొన్నే.. అందులో కొంతమంది క్రికెటర్లు విఫలమైనవారున్నారు. ఫ్రాంచైజీలు వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా అత్యధిక మొత్తానికి న్యాయం చేసిన వారు కొంతమందే ఉన్నారు. త్వరలోనే ఐపీఎల్ సీజన్ 14కి సంబంధించిన మినీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాళ్లెవరో చూద్దాం..

ప్యాట్ కమిన్స్​ (రూ.15.5 కోట్లు)

ఐపీఎల్​ వేలంలోకి వచ్చిన తర్వాత ఓ సీజన్​లో ప్రదర్శన చేయకపోయినా.. గతేడాది జరిగిన లీగులో మైదానంలో అడుగుపెట్టాడు ప్యాట్​ కమిన్స్​. తన అద్భుత ప్రదర్శనతో వార్తల్లో నిలిచాడు. గతేడాది వేలంలో కమిన్స్​ను సొంతం చేసుకునేందుకు దిల్లీ క్యాపిటల్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగుళూరు పోటీపడ్డాయి. ఆర్సీబీ యాజమాన్యం ఏకంగా రూ.15.25 కోట్ల వేలం పాడింది. అంతలోనే కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టు రూ.15.5 కోట్లు వెచ్చించి ఈ ఆసీస్​ ఆటగాడ్ని కొనుగోలు చేసింది.

ఐపీఎల్​ 13వ సీజన్​లో కోల్​కతా నైట్​రైడర్స్ తరఫున 9 మ్యాచ్​లు ఆడి.. 12 వికెట్లు పడగొట్టాడు కమిన్స్​. తాను ఆడిన చివరి నాలుగు మ్యాచ్​ల్లో 9 వికెట్లను సాధించాడు. దీంతో 2021లో జరగనున్న సీజన్​కూ​ కమిన్స్​ను కేకేఆర్​ జట్టు అట్టిపెట్టుకుంది.

బెన్​ స్టోక్స్​ (రూ.14.5 కోట్లు)

బెన్​స్టోక్స్​

2017లో జరిగిన ఐపీఎల్​ సీజన్​ కోసం​ వేలంలోకి వచ్చాడు ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్. ఇతడిని రూ.14.5 కోట్లతో రైజింగ్​ పుణె సూపర్​జెయింట్​ జట్టు సొంతం చేసుకుంది. దీంతో ఆ ఏడాది అత్యధిక పారితోషికం అందుకున్న విదేశీ ఆటగాడిగా నిలిచాడు. అయితే ఆ సీజన్​ మొత్తానికి అందుబాటులో లేకపోవడం వల్ల ఈసారి వేలంలో అతడ్ని ఎవరూ కొనుగోలు చేయరని భావించారు. అయితే ఫ్రాంచైజీ అతడిపై నమ్మకం ఉంచి అట్టిపెట్టుకుంది.

బెన్​ స్టోక్స్​ (రూ.12.5 కోట్లు)

ఐపీఎల్​ అరంగేట్ర సీజన్​లాగే రెండో ఏడాదిలోనూ బెన్ ​స్టోక్స్​ నిలకడగా ప్రదర్శన చేయలేదు. రెండో సీజన్​లో రూ.12.5 కోట్లతో రాజస్థాన్​ రాయల్స్​ జట్టు సొంతం చేసుకుంది. అయితే ఈసారి కూడా పూర్తి సీజన్​కు అందుబాటులో లేకుండా పోయాడు.

బెన్​స్టోక్స్​

ఈ సీజన్​లో ఆడిన 13 మ్యాచ్​ల్లో 161 బంతులను ఎదుర్కొని 196 పరుగులను రాబట్టగలిగాడు. 8 వికెట్లు పడగొట్టాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు స్టోక్స్​ రాజస్థాన్​ జట్టులోనే కొనసాగుతున్నాడు.

తైమల్​ మిల్స్​ (రూ.12 కోట్లు)

2017లో జరిగిన ఐపీఎల్​ వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాళ్లలో తైమల్​ మిల్స్​ కూడా ఉన్నాడు. ఆ ఏడాది రూ.12 కోట్లతో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగుళూరు జట్టు అతడిని సొంతం చేసుకుంది.

తైమల్​ మిల్స్​

ఆ సీజన్​లో ఆడిన ఐదు మ్యాచ్​ల్లోనూ తైమల్​ మిల్స్​ పేలవ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయాడు. 8.57 బౌలింగ్​ సగటుతో 5 వికెట్లను పడగొట్టాడు. దీంతో ఆర్సీబీ జట్టు మిల్స్​ను వదిలేయగా.. ఆ తర్వాత అతడ్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.

ఇదీ చూడండి:ఏప్రిల్​ 11 నుంచి ఐపీఎల్​ 2021!

ABOUT THE AUTHOR

...view details