ETV Bharat / sports

సందీప్​కు మరోషాక్- USA వీసా రిజెక్ట్- T20 వరల్డ్​కప్​కు కష్టమే - T20 World Cup 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 7:34 PM IST

Sandeep Lamichhane T20 World Cup: టీ20 వరల్డ్‌ కప్‌కి సిద్ధమవుతున్న నేపాల్‌ టీమ్‌కి షాక్‌ ఎదురైంది. స్టార్‌ స్పిన్నర్‌ సందీప్‌ లామిచానేకి యూఎస్‌ వీసా రిజెక్ట్‌ అయింది. ఇలా ఎందుకు జరిగిందంటే?

Sandeep Lamichhane Visa Reject
Sandeep Lamichhane Visa Reject (Source: Getty Images)

Sandeep Lamichhane T20 World Cup: జూన్‌ 1 నుంచి యూఎస్‌, వెస్టిండీస్‌లో టీ20 వరల్డ్‌ కప్‌ మొదలు కానుంది. అంతకు ముందు కొన్ని వార్మప్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు వీలైనంత ముందుగా వెళ్లడానికి ఆయా దేశాల టీమ్‌లు ప్లాన్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో స్టార్ నేపాల్ స్పిన్నర్ సందీప్ లామిచానేకు అమెరికా వీసా నిరాకరించింది. ఎందుకంటే?

సందీప్ లామిచానే(23)పై తీవ్ర అత్యాచార ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు అతను మూడు క్రికెట్‌ ఫార్మాట్‌ల నుంచి సస్పెండ్‌ అయ్యాడు. ఈ కేసు నుంచి బయటపడేందుకు సందీప్‌ సుదీర్ఘ పోరాటం చేశాడు. ఇటీవల సుప్రీం కోర్టు నిర్దోషిగా తీర్పు ఇచ్చింది. క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెట్టాడు. జూన్ 1న ప్రారంభం కానున్న మెగా టోర్నమెంట్‌కి నేపాల్‌ టీమ్‌తో వెళ్తున్న అతనికి వీసా రాలేదు.

లామిచానేను టీమ్‌తో పంపడానికి చర్యలు
గతంలో, నేపాల్ క్రికెట్ ప్రెసిడెంట్, చతుర్ బహదూర్ చంద్, T20 ప్రపంచ కప్ కోసం లామిచానే జట్టుతో ప్రయాణించేలా చూసేందుకు బోర్డు ప్రతిదీ చేస్తుందని పేర్కొన్నాడు. మే 25 వరకు సిబ్బందిని మార్చే హక్కు జట్టుకు ఉందని, 15 మంది సభ్యులతో కూడిన జట్టులో స్పిన్నర్‌ను సులభతరం చేయడానికి అవసరమైన కృషి చేస్తామని ఆయన వెల్లడించారు.

టీ20 ప్రపంచ కప్ కోసం జట్టుతో కలిసి సందీప్ లామిచానే ట్రావెల్‌ చేయడానికి బోర్డు కట్టుబడి ఉందని నేపాల్ క్రికెట్ ప్రెసిడెంట్, చతుర్ బహదూర్ చంద్ పేర్కొన్నారు. మే 25 వరకు మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉందని, 15 మంది స్క్వాడ్‌లో స్పిన్నర్‌ను చేర్చడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 'కోర్టు సందీప్‌ని నిర్దోషిగా ప్రకటించాయి. అతనికి దిగువ కోర్టులు విధించిన శిక్షలు రద్దయ్యాయి. మేము సస్పెన్షన్‌ను కూడా తొలగించాం. అతన్ని ప్రపంచ కప్ జట్టులో చేర్చడానికి మే 25 వరకు సమయం ఉంది' అని చంద్ పేర్కొన్నారు.

సందీప్ ట్వీట్: సందీప్ మే 22న ఓ ట్వీట్‌లో '@USEmbassyNepal వారు 2019లో చేసినట్లే మళ్లీ చేశారు. USA, వెస్టిండీస్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌కి వెళ్తున్న నా వీసాను తిరస్కరించారు. దురదృష్టకరం. నేపాల్ క్రికెట్ శ్రేయోభిలాషులందరూ క్షమించండి' అని తెలిపాడు. 2019లో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు వెళ్లే సమయంలో వీసా రిజెక్ట్‌ కావడాన్ని గుర్తు చేశాడు.

క్రికెటర్ సందీప్​కు 8 ఏళ్ల జైలు శిక్ష- మైనర్​పై అత్యాచారం కేసులో నేపాల్ కోర్టు తీర్పు

అత్యాచారం కేసులో సందీప్​కు ఊరట- క్రికెటర్​ను నిర్దోషిగా తేల్చిన హై కోర్టు - Sandeep Lamichhane

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.