తెలంగాణ

telangana

'అందుకే కోహ్లీ గొప్ప నాయకుడయ్యాడు'

By

Published : Sep 8, 2021, 9:19 AM IST

Updated : Sep 8, 2021, 9:44 AM IST

VVS Laxman
వీవీఎస్‌ లక్ష్మణ్‌

ఓవల్​లో 50 ఏళ్ల తర్వాత భారత జట్టు చారిత్రక విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో టీమ్​ ఇండియా సారథి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై(Kohli captaincy) ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్​ వీవీఎస్‌ లక్ష్మణ్‌ (VVS Laxman Virat Kohli).. కోహ్లీ నాయకత్వాన్ని కొనియాడాడు.

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నాయకత్వంపై మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ (VVS Laxman Virat Kohli) ప్రశంసల జల్లు కురిపించాడు. ఆట పట్ల అతడి దృక్పథం, బాడీ లాంగ్వేజ్.. కోహ్లీకి(Kohli captaincy record) ఓ ప్రత్యేకత తెచ్చిపెట్టాయన్నాడు.

"నేను ఆడినప్పటి కెప్టెన్‌ సహా చాలా మంది కెప్టెన్లు.. తమ నిర్ణయాలకు కట్టుబడి ఉండేవారు. ప్రస్తుతం కోహ్లీ కూడా అదే చేస్తున్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నంత కాలం.. ఎవరేమనుకుంటున్నారనే విషయాన్ని పట్టించుకోనవసరం లేదు. అందుకే అతడు గొప్ప కెప్టెన్‌గా ఎదిగాడు. నేను కూడా దాన్ని సమర్థిస్తా. ఆట పట్ల అతడి దృక్పథం, బాడీ లాంగ్వేజ్‌ కూడా గొప్పగా ఉంటాయి. సుదీర్ఘ కాలం దాన్ని కొనసాగించడం అసాధ్యం. కానీ, కోహ్లీ కొన్ని సంవత్సరాలుగా అదే తీవ్రతతో ఆడుతున్నాడు. ఎన్నో బరువు బాధ్యతలను భుజానికెత్తుకుని.. భారత జట్టును నడిపించడమనేది సులభమేమీ కాదు. అయినా కోహ్లీ కొన్నేళ్లుగా జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు"

-లక్ష్మణ్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

ప్రస్తుతం టీమ్​ఇండియా ఇంగ్లాండ్​తో (India team for England series 2021) ఐదు మ్యాచ్​లతో కూడిన టెస్టు సిరీస్​ ఆడుతోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్​ల్లో భారత్​ 2-1తేడాతో సిరీస్​ ఆధిక్యంలో నిలిచింది. ఐదో టెస్టు​ సెప్టెంబరు 10 నుంచి ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి:టీమ్​ఇండియాకు​ దొరికాడు సరైనోడు

Last Updated :Sep 8, 2021, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details