తెలంగాణ

telangana

Nikhil: ఆస్పత్రుల బిల్లులపై హీరో​ ఆగ్రహం

By

Published : Jun 7, 2021, 11:36 AM IST

Updated : Jun 7, 2021, 11:51 AM IST

కరోనా సమయంలో కొన్ని ఆస్పత్రులు సామాన్యుల నుంచి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు యువ కథానాయకుడు నిఖిల్​. రోగుల దగ్గర నుంచి బిల్లులు వసూలు చేయడంలో కొన్ని ఆస్పత్రులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి వాటికి నియంత్రణ లేదా? అని ట్విట్టర్​ ద్వారా ప్రశ్నించారు.

Nikhil is angry over some hospital bills
Nikhil: ఆస్పత్రుల బిల్లులపై హీరో​ ఆగ్రహం

వైద్యం పేరుతో కొన్ని ఆస్పత్రులు సామాన్యుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయని యువ కథానాయకుడు నిఖిల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సర్జరీ ఏదైనా సరే.. లక్షల్లోనే బిల్లులు కట్టించుకుంటున్నారని అన్నారు. ఈ మేరకు ఆస్పత్రి బిల్లులను ఉద్దేశిస్తూ నిఖిల్‌ ఓ ట్వీట్‌ పెట్టారు.

"నేను ఎంతోమంది ఆస్పత్రి బిల్లులు పరిశీలించాను. అందులో చాలామంది బిల్లులు రూ.10 లక్షలకు మించి ఉన్నాయి. అలాగే, ఆస్పత్రి బిల్లులను చెల్లించడంలో కొంతమందికి మేము చేతనైనంత సాయం చేశాం. అయితే, బిల్లులు వసూలు చేయడంలో ఆస్పత్రులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాయి. సాధారణ సర్జరీకి కూడా మన స్థానిక ఆస్పత్రులు ఎందుకు ఇంత ఎక్కువ మొత్తాన్ని రాబట్టుకుంటున్నాయి? వీటిని నియంత్రించేది ఎవరు?."

- నిఖిల్​ సిద్ధార్థ్​, కథానాయకుడు

కరోనా కారణంగా షూటింగ్స్‌ లేకపోవడం వల్ల ఇంటికే పరిమితమైన నిఖిల్‌.. తన టీమ్‌తో కలిసి కరోనా బాధితులకు సాయం అందించారు. పలు సోషల్‌మీడియా ఖాతాల వేదికగా.. ఆస్పత్రి పడకలు, మందులు, ఏ ఇతర సామగ్రి కావాలని కోరినా.. వెంటనే తన ఆపన్నహస్తాన్ని అందించారు.

ఇదీ చూడండి:మెడికల్​ ఎమర్జెన్సీ అన్నా వినలేదు: నిఖిల్​

Last Updated : Jun 7, 2021, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details