తెలంగాణ

telangana

షాకిచ్చిన పాక్ పైలట్.. విమానాన్ని అత్యవసర ల్యాండ్​ చేసి..!

By

Published : Jan 22, 2022, 6:49 AM IST

pilot
పైలట్

Pakistan Pilot Refuses to Fly: పాకిస్థాన్​కు చెందిన ఓ పైలట్ అందరికీ షాకిచ్చాడు. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసి ఆ తర్వాత మళ్లీ విధులు నిర్వహించలేనని తేల్చిచెప్పాడు. అసలేం జరిగిందంటే..

Pakistan Pilot Refuses to Fly: విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేసిన ఓ పైలట్‌ ఆ తర్వాత మళ్లీ విధులు నిర్వహించేందుకు ససేమిరా అన్నాడు. తన డ్యూటీ టైం ముగిసిందని, వెంటనే విధులు చేపట్టలేనని తేల్చి చెప్పాడు. దీంతో విమానంలోనే గంటలపాటు ఉన్న ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్​కు (పీఐఏ) చెందిన పీకే-9754 విమానం గత ఆదివారం రియాద్‌ నుంచి పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌కు బయలుదేరింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో పాక్‌ పైలట్‌ విమానాన్ని సౌదీ అరేబియాలోని దమ్మమ్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశాడు. అయితే తిరిగి విధులు నిర్వహించేందుకు ఆ పైలట్‌ నిరాకరించాడు. తన షిఫ్ట్‌ సమయం ముగిసిందని, ఇప్పుడే విధులు చేపట్టలేనని స్పష్టం చేశాడు.

అయితే అప్పటికే విమానంలో గంటలపాటు ఎదురుచూసిన ప్రయాణికులు.. ఈ ఆలస్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పరిస్థితులు చేయిదాటిపోతుండటంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. విమానం ఎగిరేంతవరకు ప్రయాణికులకు ఓ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. 'పైలట్‌కు విశ్రాంతి అవసరం. ఈ అంశంపై విమాన భద్రత ఆధారపడి ఉంటుంది. ప్రయాణికులందరూ ఇస్లామాబాద్‌కు చేరుకునేవరకు వారికి హోటళ్లలో వసతి కల్పించాం' అని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి స్థానిక మీడియాతో పేర్కొన్నారు. కొద్ది గంటల తర్వాత విమానం అక్కడినుంచి బయలుదేరి ఇస్లామాబాద్‌కు చేరినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details