ETV Bharat / international

క్యూలో నిలబడి రోజుకు రూ.16వేలు సంపాదన

author img

By

Published : Jan 21, 2022, 5:10 PM IST

UK Man Earns Rs 16,000 Per Day Just By Standing in Queues For Rich People
ఒళ్లు అలవకుండా రోజుకు రూ.16వేల సంపాదన- యువకుడి జాబ్​ సూపర్​

UK man standing job: క్యూలో నిలబడి రోజుకు రూ.16వేలు సంపాదిస్తున్నాడు ఓ యువకుడు. గంటకు రూ.2వేలు ఛార్జ్ చేస్తున్నాడు. టికెట్ల కోసం లైన్లో నిలబడే ఓపిక లేని ధనవంతులు ఇతడి కోసం ఎగబడుతున్నారు.

UK man standing job: గంటల తరబడి క్యూలో నిలబడాలంటే చాలా మందికి చిరాకు. ఒక్కోసారి ఓపిక నశించి వచ్చిన పని పూర్తి చేసుకోకుండానే వెనుదిరుగుతుంటారు. అయితే బ్రిటన్​కు చెందిన ఓ యువకుడు మాత్రం క్యూలో నిల్చొని రోజుకు రూ.16వేలు సంపాదిస్తున్నాడు. 8 గంటల పాలు ఎంతో ఓపికగా లైన్లోనే నిలిచి ఉంటున్నాడు. ఈ పని చేసి చేసి తనకు అలవాటు అయిపోయిందని చెబుతున్నాడు.

క్యూలో ఎందుకు..?

31 ఏళ్ల ఈ బ్రిటన్ యువకుడి పేరు ఫ్రెడ్డీ బెకిట్​. తీరిక లేని ధనవంతులు కొన్ని పనుల కోసం క్యూలో ఎక్కువ సేపు నిలబడలేరు. అలాంటి వారి కోసం ఫ్రెడ్డీ లైన్లో నిలబడతాడు. గంటకు 20 యూరోలు(దాదాపు రూ.2వేలు) ఛార్జ్​ చేస్తాడు. ఇలా రోజూ తన క్లయింట్స్​ కోసం 8 గంటల వరకు క్యూలో నిల్చుంటాడు. దీని వల్ల రోజుకు 160 యూరోలు(రూ.16,234) అతనికి ముడతాయి.

బ్రిటన్​లో తరచూ చాలా ఈవెంట్లు జరుగుతాయి. వాటికి టికెట్లు కావాలంటే కనీసం గంటైనా క్యూలో నిల్చోవాలి. అందుకే వృద్ధులు, ధనికులు ఫ్రెడ్డీ వంటివారి సేవలు పొందుతారు.

అయితే రోజుకు రూ.16వేలు సంపాదిస్తున్నా.. దీన్ని ఫుల్ టైం జాబ్​లా పరిగణించబోనని ఫ్రెడ్డీ చెబుతున్నాడు. శీతాకాలంలోనే ఎక్కువ మంది తనను ఈ పని కోసం సంప్రదిస్తుంటారని పేర్కొన్నాడు. తక్కువ నైపుణ్యం అవసరం అయ్యే ఇలాంటి పనుల కోసం బ్రిటన్​లో గంటకు 20యూరోలకు మించి చెల్లించరని వివరించాడు. దీని ద్వారా బాగానే సంపాదిస్తున్నప్పటికీ ఫుల్​ టైం జాబ్ వేరేది చూసుకుంటానని తెలిపాడు.

తన నైపుణ్యాల గురించి టాస్క్​ర్యాబిట్​లో ప్రకటన కూడా ఇచ్చాడు ఫ్రెడ్డీ. జంతువుల బాగోగోలు చూసుకోవడం, ప్యాకింగ్​, మోవింగ్​, గార్డెనింగ్ వంటి పనులు చేస్తానని అందులో పేర్కొన్నాడు. అది చూసి చాలా మంది అతడ్ని సంప్రదిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం

ఇదీ చదవండి: బ్రెయిన్​డెడ్​ పేషెంట్​కు పంది కిడ్నీలు- వైద్యుల మరో ఘనత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.