తెలంగాణ

telangana

మరికొద్ది రోజుల్లో తొలి సినిమా రిలీజ్​.. ఇంతలోనే దర్శకుడు కన్నుమూత

By

Published : Feb 27, 2023, 12:20 PM IST

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. నటి జమున, దర్శకుడు విశ్వనాథ్, సింగర్ వాణీ జయరాం, యువ నటుడు తారకరత్న మరణాలను మర్చిపోకముందే.. మరో యువ దర్శకుడు కన్ను మూశారు.

Kerala filmmaker Joseph Manu James dies
Kerala filmmaker Joseph Manu James dies

సినీ పరిశ్రమను వరుస విషాదాలు వదలడం లేదు. ఒక్కొక్కరుగా మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. సీనియర్ యాక్టర్ల దగ్గర నుంచి ఎంతో భవిష్యత్తు ఉంటున్న సినీతారల వరకు హఠాత్తుగా మరణిస్తున్నారు. సీనియర్ నటి జమున, దర్శకుడు విశ్వనాథ్, సింగర్ వాణీ జయరాం, యువ నటుడు తారకతర్న మరణాలతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. వీరి మరణాలు మర్చిపోకముందే.. మరో యువ దర్శకుడు కన్నుమూశారు.

కేరళ సినీ పరిశ్రమకు చెందిన యువ దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు కేవలం 31 సంవత్సరాలు. గత కొన్నిరోజులుగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయనను కేరళలోని ఎర్నాకుళంలో అలువాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. జోసెఫ్ మృతితో మలయాళ చిత్ర సీమలో విషాదం అలుముకుంది. జోసెఫ్ తెరకెక్కిస్తున్న తొలి సినిమా నాన్సీ రాణి త్వరలో విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇంతలోనే ఆయన మరణించారు.

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సమయంలో జోసెఫ్ చనిపోవడంతో ఈ చిత్రబృందం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సాబు జేమ్స్ దర్శకత్వంలో 2004లో విడుదలైన ఐ యామ్ క్యూరియస్ అనే చిత్రం ద్వారా జోసెఫ్ బాలనటుడిగా మలయాళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మలయాళం, కన్నడ, బాలీవుడ్ చిత్రాల్లో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

ABOUT THE AUTHOR

...view details