ETV Bharat / entertainment

'ఏంటి రష్మిక.. ఉర్ఫీని ఫాలో అవుతుందా?'.. నెట్టింట ఫుల్​ ట్రోల్స్​

author img

By

Published : Feb 27, 2023, 11:59 AM IST

నేషనల్​ క్రష్​ రష్మిక పేరు నెట్టింట ఫుల్​ ట్రెండ్​లో ఉంది. అందుకు ఆమె వేసుకున్న బ్లాక్​ డ్రెస్​యే కారణం. అసలేం జరిగిందంటే?

trolls on rashmika mandanna black dress outfit
Etv trolls on rashmika mandanna black dress outfit

పుష్ప చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రష్మిక మందన్న. డీగ్లామర్​ పాత్రంలో స్టార్​ డమ్​ను సంపాదించుకుంది. కానీ తరచూ ఏదో వివాదంలో ఇరుక్కుంటుంది. ఆ మధ్య కాలంలో కేజీఎఫ్​, కాంతార చిత్రాలు తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్​పై పరోక్షంగా కామెంట్లు చేసి ట్రోల్స్​ బారిన పడింది. అంతకుముందు.. టాలీవుడ్​, బాలీవుడ్​ సినిమాల్లో పాటల కోసం ఏవో వ్యాఖ్యలు చేసింది. అలా ఎప్పుడూ నెట్టింట రష్మిక ట్రెండింగ్​లోనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఆమెపై ట్రోల్స్​ విపరీతంగా వస్తున్నాయి.

తాజాగా రష్మిక.. ఓ అవార్డుల వేడుకకు హాజరైంది. ఆ సమయంలో బ్లాక్​ డ్రెస్​ ధరించింది. కొందరు ఆమె అవుట్‌ఫిట్‌ చూసి ఆహా అంటున్నా మరికొందరు మాత్రం ఏడ్చినట్లుంది అని కామెంట్లు చేస్తున్నారు. 'ఏంటి? రష్మిక ఉర్ఫీని ఫాలో అవుతోంది.. తను ఇలా చేస్తుందని అసలు ఊహించలేదు', 'అసలు ఈ సెలబ్రిటీలకు ఏమవుతోంది? వీళ్లందరినీ బాయ్‌కాట్‌ చేసేయాలి. ఆల్‌రెడీ ఫేమస్‌ అయినవాళ్లు కూడా ఎక్స్‌పోజ్‌ చేయాల్సిన అవసరం ఏముంది?' అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి రష్మిక వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

రష్మిక సినిమాల విషయానికొస్తే.. సంక్రాంతికి విడుదలైన వారసుడు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత 'మిషన్‌ మజ్ను'తో అలరించింది. ప్రస్తుతం రణ్‌బీర్‌ కపూర్​తో 'యానిమల్‌' చేస్తోంది. పుష్ప-2 సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్​గా నటిస్తోంది. "నటన పరంగా ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లు ఎదురైతేనే మేలు. మొదట ఇంత కష్టమైన పాత్రని నేనెలా చేస్తానా? అనే భయం కలుగుతుంది. ఆ తర్వాత అంతే దీటుగా ఆ సవాళ్లని స్వీకరించి సెట్లోకి అడుగు పెడుతుంటా" అని ఇటీవలే ఓ కార్యక్రమంలో తెలిపింది రష్మిక.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.