తెలంగాణ

telangana

ఆ సెన్సిటివ్​ ఇష్యూపై బాలయ్య క్వశ్చన్​​.. అలా చేయడం మానేస్తే బెటర్​​ అన్న అల్లు అరవింద్!

By

Published : Dec 3, 2022, 4:54 PM IST

అన్​స్టాపబుల్​ కార్యక్రమంలో బాలయ్య అడిగిన ఓ సెన్సిటివ్​ టాపిక్​పై నిర్మాత అల్లు అరవింద్​ కీలక కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటంటే?

allu aravind on nepotism
ఆ సెన్సిటివ్​ ఇష్యూను టచ్​ చేసిన బాలయ్య​.. అలా చేయడం మానేస్తే బెటర్​​ అన్న అల్లు అరవింద్!

సినిమా ఇండస్ట్రీలో కొంత కాలంగా ఎక్కువగా వినిపిస్తున్న పదం నెపొటిజం. దీనిపై ఎప్పటి నుంచో వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా అన్ స్టాపబుల్ షో కు గెస్ట్​గా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ కీలక కామెంట్స్ చేశారు. వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బాలయ్య నెపోటిజంపై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "అందరినీ ఒకటే మాట అడుగుతున్నాను.. ఎవరైతే నెపోటిజం అంటూ టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారో.. వాళ్ళకి ఈ ప్రశ్న.. మీకు ఇలాంటి అవకాశం వస్తే మీరు వదులుకుంటారా..? చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో అదే వృత్తిపై ఇంట్రెస్ట్ ఉండటం కామన్. అలాగే టాలెంట్ ఉన్నప్పుడు పేరెంట్స్ చూపిన మార్గం ఎంచుకోవడంలో తప్పేమీ లేదుగా. అయినా డాక్టర్స్, ఇంజనీర్స్, బిజినెస్ మెన్, లాయర్స్ ఇలా అన్ని వృత్తుల్లో ఉన్నవారు తమ పిల్లలను అదే వృత్తిలో సెట్ చేయడం లేదా? మరి అది నెపోటిజం కాదా. నా ఫ్రెండ్ లాయర్ ఉన్నారు. వాళ్ళ కొడుకు లాయర్. ఇప్పుడు వాళ్ళు మనవడు లాయర్ చేయడానికి రెడీ అయ్యాడు. ఒక ఫ్యామిలీ ఇండస్ట్రీ వాతావరణంలో పెరిగినప్పుడు.. వేరే ఫీల్డ్​లో జాబ్ తెచ్చుకోవాలంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. ఈ క్రమంలోనే కొందరు హీరోస్ తాతలు పేర్లు నాన్నల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు. అలా వారసత్వం పేరుతో ఇండస్ట్రీలోకి వచ్చిన టాలెంట్ లేకపోతే స్టార్ హీరోగా మారలేరు. అది అందరికీ తెలిసిందే.. సో ఇలాంటి ట్రోల్లింగ్ చేసి అలాంటి హీరోల పరువు తీయడం మానేస్తే బెటర్" అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు.

ఇదే షోకు అరవింద్​తో పాటు వచ్చిన మరో నిర్మాత సురేశ్​ బాబు కూడా ఇదే విషయమై తన అభిప్రాయం బయటపెట్టారు. "నెపోటిజం అనేది కేవలం ఆరంభం మాత్రమే ఇస్తుంది. స్టార్​గా ఎదగాలంటే టాలెంట్ ఉండాల్సిందే. కేవలం వారసత్వం వల్లనే స్టార్స్ అవుతారు అనుకోవడం తప్పు" అని పేర్కొన్నారు. ఈ కామెంట్స్​ విన్న బాలయ్య.. ఆ తర్వాత షోను కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు.

ఇదీ చూడండి:సంక్రాంతికి బాలయ్య 'వీరసింహారెడ్డి' జాతర.. చిరు 'వాల్తేరు వీరయ్య'కు పోటీగా

ABOUT THE AUTHOR

...view details