తెలంగాణ

telangana

విమర్శలపై 'ఆదిపురుష్​' టీమ్​ వర్కౌట్.. రూ.100 కోట్లు ఖర్చుపెట్టి రీషూట్?

By

Published : Nov 6, 2022, 12:59 PM IST

Adipurush Release Date : పాన్​ ఇండియా​ స్టార్​ ప్రభాస్​ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'​. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్​ విమర్శలు వచ్చాయి. వాటిపై చిత్ర యూనిట్ దృష్టి సారించినట్లు సమాచారం. అయిేత ఈ సినిమా విడుదల మంరింత ఆలస్యం కానుంది. కారణం ఏంటంటే..

Adipurush Release Date
Adipurush Release Date

Adipurush Release Date : పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ 'ఆదిపురుష్‌' ఓంరౌత్‌ దర్శకుడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం మొదటి నుంచి భావించినప్పటికీ అనుకోని కారణాల వల్ల వాయిదాపడినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీని ప్రకారం ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు.

ఇదిలా ఉండగా, 'ఆదిపురుష్‌' రిలీజ్‌పై తాజాగా పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతోన్నాయి. ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని ఆయా వార్తల్లోని సమాచారం. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన విమర్శలపై ఫోకస్‌ చేసిన చిత్రబృందం.. టెక్నికల్‌ అంశాలపై దృష్టి పెట్టిందని.. ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు పెట్టి మరోసారి వీఎఫ్‌ఎక్స్‌, సీజీ పనులు చేయిస్తోందని బీటౌన్‌ టాక్. ఒకవేళ ఇదే కనుక నిజమైతే 'ఆదిపురుష్‌' వచ్చే ఏడాది సమ్మర్‌లో కూడా థియేటర్లలోకి వచ్చే అవకాశం లేదని ఆయా కథనాల్లోని సారాంశం.

రామాయణాన్ని ఆధారంగా చేసుకుని 'ఆదిపురుష్‌' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్‌ రాముడి పాత్రలో, సీతగా కృతిసనన్‌ నటించారు. రామాయణంలో కీలకపాత్రగా భావించే రావణాసురుడిగా సైఫ్‌ అలీఖాన్‌ కనిపించనున్నారు. దసరా వేడుకల్లో భాగంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాము ఊహించిన స్థాయిలో టీజర్‌ లేదని, లంకేశ్వరుడు, హనుమంతుడు లుక్స్‌, వీఎఫ్‌ఎక్స్‌ అంతగా బాగోలేదని విమర్శించారు. దీంతో టీమ్‌.. ఇప్పుడు తప్పులను సరిచేసే పనిలో పడినట్లు సమాచారం.

ఇదీ చదవండి:బొమ్మ బ్లాక్​ బస్టర్​ సక్సెస్​ సెలబ్రేషన్స్​ చిన్న సినిమాలను ఆదరించమని రష్మీ రిక్వెస్ట్​

విశ్వక్‌సేన్‌.. కమిట్‌మెంట్‌ లేని నటుడు.. ఇది నిజంగా అవమానమే!: అర్జున్‌ అసహనం

ABOUT THE AUTHOR

...view details