బొమ్మ బ్లాక్​ బస్టర్​ సక్సెస్​ సెలబ్రేషన్స్​ చిన్న సినిమాలను ఆదరించమని రష్మీ రిక్వెస్ట్​

By

Published : Nov 5, 2022, 5:17 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

thumbnail

నందు, రష్మీ జంటగా రాజ్ విరాట్ దర్శకత్వంలో నటించి చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజై మాస్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా తమ చిత్రాన్ని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు చిత్రబృందం కృతజ్ఞతలు తెలిపింది. హైదరాబాద్​లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్​లో బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనను గుర్తు చేసుకుంటూ కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. పోతురాజు పాత్ర మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని, భాస్కరభట్ల రాసిన నాన్న సాంగ్​కు థియేటర్​లో చప్పట్లు కొడుతున్నారని నందు, రష్మీలు తెలిపారు. చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.