తెలంగాణ

telangana

Hunters : దుప్పిని వేటాడిన 10 మంది వేటగాళ్లు అరెస్టు

By

Published : Jun 8, 2021, 1:03 PM IST

నిషేధిత ఆయుధాలతో అడవిలోకి అక్రమంగా చొచ్చుకుపోయి.. జంతువులను వేటాడిన 10 మంది వేటగాళ్లను(Hunters) నాగర్ కర్నూల్ జిల్లాలో అటవీ అధికారులు అరెస్టు చేశారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

hunting, hunter, animal hunting
వేటగాళ్లు, జంతువుల వేట, వన్యప్రాణుల వేట

నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం గుంపన్​పల్లి గ్రామానికి చెందిన 10 మంది వేటగాళ్ల(Hunters)ను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. చౌటపల్లి గ్రామ సమీపంలోని మశమ్మ మడుగు అటవీ ప్రాంతంలోకి మే 3న ముగ్గురు, 7న ఏడుగురు వేటగాళ్లు నిషేధిత ఆయుధాలతో అక్రమంగా ప్రవేశించారు.

దుప్పిని నరకి..
దుప్పిని వేటాడిన వేటగాడు

అతి కిరాతకంగా చుక్కల దుప్పి వంటి జంతువులను ముక్కలు ముక్కలుగా నరికి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు అక్కడే ఉఉన్న రహస్య కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా మే 29న ముగ్గురు, జూన్ 3న ఏడుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు పంపారు. వన్యప్రాణులకు హాని తలపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ అధికారులు హెచ్చరించారు.

ముక్కలు ముక్కలుగా నరికి..
వన్యప్రాణుల వేట..
అరెస్టయిన వేటగాళ్లు

ABOUT THE AUTHOR

...view details