తెలంగాణ

telangana

Inflation: 'వ్యవస్థను వెంటాడుతున్న ద్రవ్యోల్బణం'

By

Published : May 27, 2021, 7:09 AM IST

ముడి పదార్థాల అధిక ధరల కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం(Inflation) పెరుగుతోందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌(crisil) అభిప్రాయపడింది. ఈ ఆర్థిక సంవత్సరం ఐదు శాతం ద్రవ్యోల్బణం నమోదవుతుందన్న తమ అంచనా కంటే అధికంగానే ఉండొచ్చని తన నివేదిక(report)లో పేర్కొంది.

inflation
ద్రవ్యోల్బణం

ముడిపదార్థాల అధిక ధరలకు తోడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న ఇబ్బందుల కారణంగా ధరలపై ఒత్తిడి కనిపిస్తోందని.. దీనివల్ల ద్రవ్యోల్బణం(inflation) తిరిగి మనల్ని వెంటాడే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌(crisil) అంటోంది. అందుకే 2020-21లో ఐదు శాతం ద్రవ్యోల్బణం నమోదవుతుందన్న తమ అంచనా కంటే అధికంగానే ఉండొచ్చని క్రిసిల్‌ తన నివేదికలో పేర్కొంది.

'గతేడాది ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం మేర క్షీణించినా ఈ ద్రవ్యోల్బణ ఆందోళన మధ్య రేట్ల కోత జరగలేదు. ఏప్రిల్‌, మే 2020లో జాతీయ లాక్‌డౌన్‌(lockdown) కారణంగా సమాచార సేకరణకు అంతరాయం కలిగింది. అందుకే గతేడాది ప్రాతిపదికగా తీసుకుంటే సరైన ధోరణిని ప్రతిబింబించదు. ఈ నేపథ్యంలో నెలవారీ ధరల ధోరణిపైనే దృష్టి పెట్టినట్లు' తెలిపింది.

డబ్ల్యూపీఐ(wholesale price index), సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణాలు రెండూ అంతక్రితం నెలతో పోలిస్తే 2021 ఏప్రిల్​లో పెరిగాయి. అంతర్జాతీయ కమొడిటీ (commodity) ధరలు పెరిగిన కారణంగా ముడిపదార్థాలూ భారమయ్యాయి. దీంతో తయారీ వ్యయాలు పెరిగి దేశీయ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపాయని ఈ నివేదిక అంటోంది.

ఇవీ చదవండి:జీవితకాల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం!

ఏప్రిల్​లో తగ్గిన రిటైల్​ ద్రవ్యోల్బణం

ABOUT THE AUTHOR

...view details