తెలంగాణ

telangana

ఆ బీర్లలో డేంజరస్ కెమికల్స్.. రూ.25 కోట్లు విలువైన బాటిళ్లు సీజ్

By

Published : Aug 16, 2023, 6:51 PM IST

Updated : Aug 16, 2023, 7:30 PM IST

Spurious Beers In Karnataka : కల్తీ బీర్లు తయారుచేస్తున్న రెండు కంపెనీలపై చర్యలు తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. బీర్​లలో ప్రమాదకర రసాయనాలను ఉన్నట్లు గుర్తించి.. ల్యాబ్​కు పంపి పరీక్షలు చేయించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది.

spurious beers in karnataka
spurious beers in karnataka

Spurious Beers In Karnataka : కర్ణాటకలో కల్తీ బీర్లు కలకలం రేపాయి. రెండు ప్రముఖ కంపెనీలకు చెందిన బీర్​లలో ప్రమాదకర రసాయనాలను గుర్తించారు రాష్ట్ర ఎక్సైజ్ పోలీసులు. ఈ క్రమంలో రూ.25 కోట్లు విలువైన 78,678 బీర్​ బాటిళ్ల బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత కంపెనీ యజమానులపై కేసు నమోదు చేశారు.

జులై 28న మైసూర్.. నంజనగూడులో రెండు బీర్​ల తయారీ కంపెనీల్లో ప్రమాదకర రసాయనాలను ఉపయోగిస్తున్నారని మైసూర్ ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు.. ఆ కంపెనీలకు చెందిన బీర్ల శాంపిల్స్​ను కొద్ది రోజుల క్రితం ల్యాబ్​కు పంపారు. కాగా.. బీర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు నివేదిక వచ్చింది. ఈ క్రమంలో ఎక్సైజ్ అధికారులు ఆ రెండు కంపెనీలకు చెందిన బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని త్వరలోనే ధ్వంసం చేస్తామని అధికారులు తెలిపారు.

బంగారం, ఐఫోన్లు స్వాధీనం..
Iphones Seized In Amritsar Airport News : మరోవైపు.. పంజాబ్​లోని అమృత్​సర్ ఎయిర్​పోర్టులో ఐఫోన్లు, బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వారి దగ్గర నుంచి 57 ఐఫోన్లు, 490 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరూ షార్జా నుంచి అమృత్​సర్​కు ఓ విమానంలో వచ్చినట్లు అధికారులు తెలిపారు.

'షార్జా నుంచి ఇద్దరు ప్రయాణికులు ఆగస్టు 15వ తేదీన ఓ విమానంలో అమృత్​సర్​కు వచ్చారు. వారిపై అనుమానం వచ్చి తనిఖీలు చేశాం. అప్పుడు ఓ వ్యక్తి దగ్గర 29 ఐఫోన్లు, 245 గ్రాముల బంగారు గొలుసు, ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నాం. మరో వ్యక్తి దగ్గర 28 ఐఫోన్లు, 245 గ్రాముల బంగారాన్ని జప్తు చేశాం. ఆ ఐఫోన్లు, బంగారం విలువ రూ.94.83 లక్షలు ఉంటుంది.' అని అమృత్​సర్ విమానాశ్రయ అధికారులు తెలిపారు.

61 కిలోల బంగారం స్వాధీనం..
గతేడాది నవంబరులో అక్రమంగా రవాణా చేస్తున్న 61 కిలోల బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ బంగారం విలువ రూ.32 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. రెండు వేర్వేరు కేసుల్లో ఈ బంగారం పట్టుబడినట్లు పేర్కొన్నారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ఏడుగురు ప్రయాణికులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని వెల్లడించారు. ఒక్కరోజులో పట్టుబడిన అత్యధిక బంగారం ఇదేనని అధికారులు తెలిపారు.

కల్తీ మద్యానికి 12 మంది బలి.. ప్రాణాపాయ స్థితిలో అనేక మంది..

'సారా ఇప్పించండి సారూ'... హోంమంత్రికి కల్తీ మద్యం బాధితుడి విజ్ఞప్తి

Last Updated : Aug 16, 2023, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details