ETV Bharat / bharat

61కేజీల బంగారం స్మగ్లింగ్.. విలువ రూ.30 కోట్ల పైనే.. ఎలా తెచ్చారంటే..?

author img

By

Published : Nov 13, 2022, 5:45 PM IST

Updated : Nov 13, 2022, 7:15 PM IST

gold smuggling mumbai Airport
బంగారం స్మగ్లింగ్ కేసు

ముంబయి ఎయిర్​పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రెండు వేర్వేరు ఘటనల్లో 61 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన బంగారం విలువ రూ.32 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

అక్రమంగా రవాణా చేస్తున్న 61 కిలోల బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ బంగారం విలువ రూ.32 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. రెండు వేర్వేరు కేసుల్లో ఈ బంగారం పట్టుబడినట్లు పేర్కొన్నారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ఏడుగురు ప్రయాణికులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని వెల్లడించారు. ఒక్కరోజులో పట్టుబడిన అత్యధిక బంగారం ఇదేనని అధికారులు తెలిపారు.

gold smuggling mumbai
పట్టుబడిన బంగారం

టాంజానియా నుంచి వచ్చిన నలుగురు భారతీయులు.. బంగారాన్ని బిస్కెట్లు రూపంలో తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అమర్చిన బెల్టులలో వీటిని అమర్చి తీసుకొస్తుండగా అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి నుంచి 55 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం బిస్కెట్ల ధర రూ.28.17 కోట్లు ఉంటుందని తెలిపారు. వీరికి ఈ బంగారాన్ని దోహా విమానాశ్రయంలో సుడాన్ దేశస్థుడు అందించాడని పేర్కొన్నారు. మరో కేసులో.. దుబాయ్​ నుంచి వచ్చిన విస్తారా విమానంలో ముగ్గురు ప్రయాణికుల నుంచి 8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం ధర రూ. 3.88 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

gold smuggling mumbai
పట్టుబడిన బంగారం

అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకోవడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ముంబయి విమానశ్రయ కస్టమ్స్ అధికారులను అభినందించారు. అధికారులు సమయానుకూలంగా తీసుకున్న చర్యల వల్లే స్మగ్లర్లు పట్టుబడ్డారని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.

ఇవీ చదవండి: తాను చనిపోయి మరో ఇద్దరిని బతికించిన 18 నెలల చిన్నారి.. చిన్న వయసులోనే అవయవదానం

'మా నాన్నను ఎందుకు చంపారు?'.. నళినిని ప్రశ్నిస్తూ ఏడ్చేసిన ప్రియాంక

Last Updated :Nov 13, 2022, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.