తెలంగాణ

telangana

పెళ్లైన 4 నెలలకే నవవధువు హత్య.. అత్తింటి ముందే కూతురి మృతదేహం దహనం!

By

Published : Jul 19, 2023, 7:36 PM IST

బిహార్ గోపాల్​గంజ్​లో షాకింగ్ ఘటన జరిగింది. భర్త ఇంటి ఎదుటే యువతి మృతదేహాన్ని దహనం చేసేందుకు యత్నించారు తల్లిదండ్రులు. అదనపు కట్నం కోసం పెళ్లైన నాలుగు నెలలకే.. తమ కూతురిని చంపారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Etv Bharat
Etv Bharat

అదనపు కట్నం కోసం పెళ్లైన నాలుగు నెలలకే ఓ నవవధువును హత్య చేశారు అత్తింటి వారు! కుమార్తెను హత్య చేశారన్న కోపంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు.. ఆమె మృతదేహాన్ని వారి ఇంటి ఎదుటే దహనం చేసేందుకు యత్నించారు. ఈ ఘటన బిహార్​లోని గోపాల్​గంజ్​లో జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ జరిగింది
సివాన్ జిల్లా బఢహరియా పోలీస్ స్టేషన్​ పరిధిలోని సవ్నా గ్రామానికి చెందిన శంభు శరన్​ ప్రసాద్​ కూతురు నిశా కుమారి. ఈమెను అలాపుర్​ గ్రామానికి చెందిన ముకేశ్​ కుమార్​కు ఇచ్చి.. సంప్రదాయాల ప్రకారం ఫిబ్రవరిలో ఘనంగా వివాహం చేశారు. పెళ్లి తర్వాత అదనపు కట్నం రూ. 10 లక్షలు తీసుకురావాలంటూ నిశాను వేధింపులకు గురిచేశారు అత్తింటి వారు. మరోవైపు ముకేశ్​కు మరో మహిళతో కూడా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న నిశా కుమారి.. ముకేశ్​ను ప్రశ్నించింది. ఈ విషయమై వీరిద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆమెపై దాడి చేసి హత్య చేశారు ముకేశ్ కుటుంబ సభ్యులు. పక్కింటి వారు ఈ విషయాన్ని మృతురాలి తల్లిదండ్రులకు తెలియజేయడం వల్ల వెంటనే వచ్చారు. అప్పటికే ముకేశ్ కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారు.

మృతురాలు నిశా కుమారి

ఇంట్లోకి వెళ్లి చూసే సరికి తమ కూతురు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశాడు మృతురాలి తండ్రి. దీంతో ఆగ్రహానికి గురైన నిశా కుటుంబ సభ్యులు.. వారి ఇంటి ముందే మృతదేహాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించారు. గ్రామస్థులు అడ్డుచెప్పినా వినిపించుకోకుండా మృతదేహానికి ఇంటిముందే నిప్పుపెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిశా కుటుంబ సభ్యులతో మాట్లాడి సర్దిచెప్పారు.

అత్తింటి ముందే మృతదేహాన్ని దహనం చేస్తున్న బంధువులు

"మృతదేహాన్ని ఇంటి ముందే దహనం చేస్తున్నారని తెలియగానే.. ఘటనా స్థలానికి వెళ్లాం. వారితో మాట్లాడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించాం. పోస్టుమార్టమ్​ పరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించాం."

--దినేశ్ యాదవ్​, పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్

అత్తింటి ముందే మృతదేహాన్ని దహనం చేస్తున్న బంధువులు

ఇవీ చదవండి :హనీమూన్​కు వెళ్లి డాక్టర్​ దంపతులు మృతి.. పెళ్లైన పది రోజులకే..

పెళ్లైన మూడో రోజుకే యువతి ఆత్మహత్య- అమ్మానాన్న అలా చేశారని...

ABOUT THE AUTHOR

...view details