తెలంగాణ

telangana

ఇస్లాం నుంచి హిందూ మతంలోకి మారిన యువకుడు.. రామాలయంలో ప్రియురాలితో పెళ్లి..

By

Published : Jun 17, 2023, 10:22 AM IST

Updated : Jun 17, 2023, 10:39 AM IST

ఓ యువకుడు ఇస్లాంను వీడి హిందూ మతాన్ని స్వీకరించాడు. అనంతరం తన ప్రేయసిని దేవాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లాడాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

muslim convert to hindu
muslim convert to hindu

మధ్యప్రదేశ్​.. నర్సింగ్​పుర్​లో అరుదైన ఘటన జరిగింది. ఓ ముస్లిం యువకుడు.. హిందూ మతాన్ని స్వీకరించాడు. అనంతరం ఫాజిల్ ఖాన్​గా ఉన్న తన పేరును అమన్ రాయ్​గా మార్చుకున్నాడు. మతం మారిన తర్వాత తన ప్రేయసి సోనాలిని పెళ్లి చేసుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?

నర్సింగ్​పుర్​.. కరోలీకి చెందిన అమన్​ రాయ్​​, సోనాలి గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వివాహానికి ముందు ఫాజిల్ ఖాన్​.. వేద మంత్రాల సాక్షిగా రామచరిత మానస్ చేతిలో పట్టుకుని హిందూ మతాన్ని స్వీకరించాడు. ఈ కార్యక్రమానికి హిందూ సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం శ్రేయాభిలాషుల సమక్షంలో తన ప్రేయసి సోనాలిని శుక్రవారం పెళ్లి చేసుకున్నాడు అమన్​ రాయ్. ఈ పెళ్లికి శ్రీరాముని దేవాలయం వేదికైంది. సోనాలి నుదిట కుంకుమ బొట్టును పెట్టి భార్యగా స్వీకరించాడు అమన్ రాయ్​. తన ప్రేయసి సోనాలి పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అమన్​ రాయ్ చెప్పాడు.

పెళ్లి చేసుకున్న అమన్ రాయ్, సోనాలి

"గత ఐదేళ్లగా అమన్​ రాయ్​,​ నేను ప్రేమించుకుంటున్నాం. అతడు నా పట్ల బాగా శ్రద్ధ చూపిస్తాడు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఇస్లాం నుంచి హిందూ మతం మారాలనుకుంటున్నానని నా ప్రియుడు చెప్పాడు. నేను సరే అన్నాను. ఆ తర్వాత ఇద్దరం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మతం మారాక వివాహం చేసుకున్నాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది."
--సోనాలి, వధువు

తనకు చిన్నప్పటి నుంచి హిందూ మతం పట్ల ఇష్టం ఉందని అమన్​ రాయ్ తెలిపారు. తన తండ్రి హిందువు అయినప్పటికీ పెళ్లైన తర్వాత ఇస్లాంలోకి మారాడని చెప్పాడు. తన తల్లి ముస్లిం కావడం వల్లే ఇలా జరిగిందని అన్నాడు. తన స్నేహితుల్లో ఎక్కువ మంది హిందువులు ఉన్నారని.. వారందరూ తన పట్ల అభిమానం చూపిస్తారని పేర్కొన్నాడు. దేవాలయాలను సందర్శించడం తనకు చాలా ఇష్టం అని, చిన్నప్పటి నుంచి హిందు దేవుళ్లకు పూజలు చేస్తున్నానని అమన్​రాయ్ చెప్పాడు.

'ఫాజిల్ ఖాన్​కు​ మొదటి నుంచి హిందూ మతం అంటే ఆసక్తి ఎక్కువ. హిందూ దేవుళ్లను పూజించేవాడు. ఎవరైనా ప్రసాదం ఇస్తే తినేవాడు. ఫాజిల్ ఖాన్ తండ్రి కూడా పెళ్లికి ముందు హిందువే. వివాహం అయ్యాక ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. ఫాజిల్ ఖాన్.. ఇస్లాం మతం నుంచి హిందూ మతంలోకి మారిన తర్వాత అమన్​ రాయ్​గా పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం.. తన ప్రేయసి సోనాలిని వివాహం చేసుకున్నాడు.' అని ఫాజిల్​ ఖాన్ పనిచేస్తున్న రెస్టారెంట్​ యజమాని తెలిపాడు.

Last Updated : Jun 17, 2023, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details