ETV Bharat / state

'మతం మారడమే కాదు... ప్రేమకోసం ఎందాకైనా వెళ్తా!'

author img

By

Published : Feb 11, 2020, 4:47 PM IST

ప్రేమను గెలిపించుకునేందుకు ఎందాకైనా వెళ్తానంటున్నాడు... ప్రేమకోసం మతం మారిన వికారాబాద్​కు చెందిన బొబ్బిలి భాస్కర్​ అలియాస్​ అబ్దుల్​ హునైన్​. మతం మారినా... పెళ్లికి అమ్మాయి కుటుంబీకులు ఒప్పుకోకపోవటంతో... న్యాయం చేయాలంటూ గతంలో హెచ్​ఆర్​సీని ఆశ్రయించాడు.

Love_Victim
Love_Victim

ప్రేమకోసం ఎన్నో అడ్డంకులు అధిగమించి... చివరకు మతం సైతం మారాడు వికారాబాద్​కు చెందిన బొబ్బలి భాస్కర్ అలియాస్ అబ్దుల్‌ హునైన్‌. మతం మారినా ప్రియురాలి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించటంతో అతను మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. దర్యాప్తు కోసం ఇవాళ హెచ్​ఆర్​సీ ఎదుట అబ్దుల్ హునైన్‌... ప్రియురాలిని సైతం ఆమె తల్లిదండ్రులు హాజరుపరచనున్నారు.

దాదాపు ఏడాది నుంచి తన ప్రియురాలిని ఎప్పుడెప్పుడు చూడాలా అని హునైన్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. కమిషన్​ దగ్గర తీర్పు వ్యతిరేకంగా వస్తే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పాడు. ఒకవేళ ప్రియురాలి మనసు మార్చి తనతో పెళ్లికి నిరాకరించేలా చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన పేర్కొన్నాడు.

మతం మారడమే కాదు... ప్రేమకోసం ఎందాకైనా వెళ్తా!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.