తెలంగాణ

telangana

నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు- కర్ణాటకలో కలకలం

By

Published : Nov 17, 2021, 4:42 PM IST

Updated : Nov 17, 2021, 5:25 PM IST

కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. రామనగర జిల్లాలోని కన్వ రిజర్వాయర్ వద్ద వరదల ధాటికి నది ఒడ్డున పూడ్చిన మృతదేహాలు కొట్టుకువచ్చాయి.
kanva reservoir
కర్ణాటకలో వరద ఉద్ధృతి.. జలాశయానికి కొట్టుకువచ్చిన మృతదేహాలు

నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు

భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్​కు మృతదేహాలు కొట్టుకు వచ్చిన ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లాలో వెలుగుచూసింది. గత కొద్దిరోజులుగా ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. కన్వ జలాశయం వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

కన్వ నది ఒడ్డునే స్థానికులు మృతదేహాలను పూడ్చేవారు. అయితే ఇటీవల భారీ వర్షాలకు నది ఉద్ధృతి పెరగడం వల్ల ఆ శవాలన్నీ నదిలో కొట్టుకుపోయాయి. హున్​సనాహల్లి-కొండాపుర్​ ప్రాంతాల మధ్య ఎక్కువగా ఈ శవాలు కొట్టుకుపోవడాన్ని గుర్తించినట్లు స్థానికులు పేర్కొన్నారు.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ జలాశయంలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుందని స్థానికులు చెప్పారు.

ఇదీ చూడండి :పెళ్లికాని ప్రసాదుల్లా 40వేల మంది- 'వధువు' కోసం ఆ రాష్ట్రాల్లో వేట

Last Updated :Nov 17, 2021, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details