తెలంగాణ

telangana

Girl Raped And Killed : చాక్లెట్​ ఇస్తానని నమ్మించి ఆరేళ్ల బాలికపై హత్యాచారం.. సినీ ఫక్కీలో స్కెచ్​ వేసి నిందితుడు అరెస్ట్​

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 10:23 PM IST

Girl Raped And Killed : చాక్లెట్​ ఇస్తానని చెప్పి ఓ మైనర్​పై హాత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని థానేలో వెలుగు చూసింది. మరోవైపు 5 ఏళ్ల బాలికపై 7 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఈ దారుణం ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పూర్​ జిల్లాలో జరిగింది.

7 Year Old Boy Raped 5 Year Old Girl In Kanpur Dehat
Thane 6 Year Girl Child News

Girl Raped And Killed In Thane :చాక్లెట్​ ఇస్తానని నమ్మించి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గుడు. అంతటితో ఆగకుండా ఆ పసిపాపను చిత్రహింసలకు గురిచేసి చంపేశాడు. ఆపై మృతదేహాన్ని ప్లాస్టిక్​ బకెట్​లో కుక్కి బిహార్​కు పరారయ్యాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండీ నగరంలో జరిగింది.

అత్యాచారం చేసి ఆపై బకెట్​లో కుక్కి..!
ఈ ఘటన సెప్టెంబర్ 13న జరిగింది. హత్యకు గురైన ఆరేళ్ల బాలిక తల్లిదండ్రులు రోజులాగే ఉద్యోగానికి వెళ్లారు. ఆ సమయంలో చిన్నారితో పాటు తన తొమ్మిదేళ్ల సోదరుడు ఇంట్లోనే ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో బాలిక చాక్లెట్​ కోసం షాప్​న​కు వెళ్లింది. ఇది గమనించిన నిందితుడు 32 ఏళ్ల సలామత్ అలీ ఆలం అన్సారీ.. ఆ పసిబిడ్డకు చాక్లెట్​ ఇస్తానని నమ్మించాడు. అనంతరం తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పాపను హత్య చేసి మృతదేహాన్ని బకెట్‌లో కుక్కి ఇంటి బయటి నుంచి తాళం వేసి పరారయ్యాడు. ఇదిలా ఉండగా పని నుంచి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులకు చెల్లి కనిపించడం లేదంటూ చెప్పాడు సోదరుడు. దీంతో చుట్టుపక్కలా అంతా వెతికినా బాలిక జాడ లభ్యం కాలేదు. దీంతో భివాండీ నగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. సెప్టెంబర్ 15 మధ్యాహ్నం బాలిక మృతదేహాన్ని బకెట్​లో కుక్కిన ప్రాంతం నుంచి దుర్వాసన వస్తుందంటూ కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న భివాండీ సిటీ పోలీస్ స్టేషన్‌లో సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ చేతన్ కకాడే నేతృత్వంలోని మూడు ప్రత్యేక పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని.. గదిలో ప్లాస్టిక్ బకెట్‌లో ఉన్న బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముంబయిలోని జేజే ఆస్పత్రికి తరలించారు. దీంతో పోలీసులకు క్లూ దొరికింది. ఈ కోణంలో విచారణను వేగవంతం చేశారు.

సినీ ఫక్కీలో నిందితుడి అరెస్టు!
విచారణలో భాగంగా నిందితుడు బిహార్​లోని​ నవాబ్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల సలామత్ అలీ ఆలం అన్సారీగా గుర్తించారు పోలీసులు. కాగా, పోలీసులు తనకోసం వెతుకుతున్నారని తెలుసుకున్న నిందితుడు తన మొబైల్ ఫోన్​ను స్విచ్ఛాఫ్​ చేసుకున్నాడు. దీంతో నిందితుడిని పట్టుకోవడం కష్టంగా మారింది. అప్పటికే బిహార్​కు చేరుకున్న మహారాష్ట్ర పోలీసులు.. సినీ ఫక్కీలో ఓ సూపర్​ ప్లాన్​ వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నవాద్ గ్రామంలో ఓ మంచి పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా బిహారీ భాషలో ప్రకటన చేయించారు. ఇది విన్న నిందితుడు సలామత్ అలీ దాక్కుని ఉన్న చోటు నుంచి జనాల్లోకి వచ్చాడు. ఇదే అదనుగా భావించిన ముంబయి పోలీసులు సెప్టెంబర్ 19న బిహార్ పోలీసుల సహాయంతో నిందితుడిని అరెస్టు చేశారు. బాలిక మృతదేహానికి సంబంధించి పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ నవనాథ్ ధావలే తెలిపారు. ఈ రిపోర్టులో బాలికపై అత్యాచారం జరిపి ఆమెను చిత్రహింసలకు గురిచేసినట్లుగా నిర్ధరణ అయిందని పోలీసులు చెప్పారు.

5 ఏళ్ల బాలికపై 7 ఏళ్ల బాలుడు అత్యాచారం!
ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పూర్​ దేహత్​ జిల్లాలో ఘోరం జరిగింది. పక్కింట్లో ఉండే 5 ఏళ్ల బాలికపై 7 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సెప్టెంబర్ 18న కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం బాధిత చిన్నారిని వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సెప్టెంబర్ 17 సాయంత్రం అక్బర్‌పూర్​ ప్రాంతంలోని ఓ గ్రామంలో పిల్లలు ఆడుకుంటున్నారు. అదే గ్రామంలో నివసిస్తున్న వికలాంగ దంపతుల 7 ఏళ్ల కుమారుడు.. పొరుగున ఉన్న 5 ఏళ్ల బాలికను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. చాలా సేపటికి చిన్నారి గదిలో నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి చేరుకుంది. దీనిపై కుటుంబ సభ్యులు ఆరాతీయగా జరిగిన విషయం వారితో చెప్పింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మాట్లాడిన అక్బర్‌పూర్ CO అరుణ్ కుమార్ సింగ్.. నిందితుడు వయస్సు 7 సంవత్సరాల కంటే తక్కువ కాబట్టి నిబంధనల ప్రకారం అతడికి ఎలాంటి శిక్షను విధించలేము. ఇలాంటి పిల్లలకు ప్రొబేషన్ విభాగం కౌన్సెలింగ్ ఇచ్చి సరైన దారిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details