ETV Bharat / bharat

Dead Policeman Comes Alive : అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి.. పోస్టుమార్టమ్​కు తరలిస్తుండగా 'బతికిన' పోలీస్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 6:35 PM IST

Updated : Sep 20, 2023, 7:02 PM IST

Dead Policeman Comes Alive In Punjab
Dead Policeman Comes Alive In Punjab

Dead Policeman Comes Alive In Punjab : పంజాబ్​ రాష్ట్రం లుథియానాలో విచిత్ర సంఘటన జరిగింది. చనిపోయాడనుకొని పోస్ట్​మార్టంకు తరలిస్తున్న ఓ పోలీసు అధికారి మృతదేహంలో కదలికలు రావడం వల్ల ఒక్కసారిగా అందరూ కంగుతిన్నారు. దీంతో అతడిని వేరే ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడారు.

Dead Policeman Comes Alive In Punjab : చనిపోయాడనుకొని పోస్ట్​మార్టమ్​కు తరలిస్తున్న ఓ పోలీసు అధికారి తిరిగి బతికాడు. ఆయన మృతదేహంలో కదలికలను గమనించిన కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. దీంతో ఆయనను వేరే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి ప్రాణాలు రక్షించారు. ఈ విచిత్ర సంఘటన పంజాబ్​లోని లుథియాలనాలో వెలుగు చూసింది.

ఇదీ జరిగింది
మన్​ప్రీత్​ అనే పోలీసు అధికారి లుథియానాలోని నాయబ్​ కోర్టులో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఈయన చేతికి ఇటీవలే ఓ విషపూరితమైన పురుగు కుట్టింది. దీంతో ఆయన్ను సెప్టెంబర్​ 15న లుథియానాలోని AIIMC బస్సీ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. దీని కారణంగా మన్​ప్రీత్​ శరీరమంతా ఇన్​ఫెక్షన్​ సోకింది. దీంతో ఆయనను వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందించారు వైద్యులు. అయినా మన్​ప్రీత్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఇది గమనించిన మన్​ప్రీత్​ తండ్రి ఏఎస్​ఐ రామ్​జీ తన కుమారుడిని వేరే ఆస్పత్రికి రిఫర్​ చేయాల్సిందిగా వైద్యులను కోరారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్​ 18న అర్ధరాత్రి సమయంలో మన్​ప్రీత్​ మృతి చెందాడని ఆస్పత్రి సిబ్బంది రామ్​జీకి చెప్పారు. ఆస్పత్రి యాజమాన్యం కూడా ఆయన డెడ్​బాడీని పోస్ట్​మార్టం కోసం సెప్టెంబర్​ 19న ఉదయం 9 గంటలకు ప్రత్యేక అంబులెన్స్​లో తరలిస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఆయన శరీరంలో కదలికలను గుర్తించాడు అక్కడే డ్యూటీలో ఉన్న ఓ పోలీసు అధికారి. ఈ విషయాన్ని మన్​ప్రీత్​ కుటుంబసభ్యులకు తెలియజేశాడు. ఇది తెలుసుకున్న వారంతా ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. వెంటనే ఆయనను DMC ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం మన్​ప్రీత్​ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఆసుపత్రి వైద్యుల వెర్షన్​!
మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం, వైద్యుల వాదన భిన్నంగా ఉంది. పేషెంట్​ కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు. అయితే ఆసుపత్రిలో చేర్పించేముందు మన్​ప్రీత్​కు విషపూరితమైన పురుగు కుట్టిందని కుటుంబ సభ్యులు తమకు తెలపలేదని.. కేవలం చేయి, కాలులో మాత్రమే గాయమైందని చెప్పారని తెలిపారు. పైగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు బీపీతో బాధపడుతున్నాడు. అలాగే చెయ్యి పూర్తిగా దెబ్బతింది. ఈ కారణంగానే ఆయన ఆరోగ్యం క్షీణించి ఉంటుందని AIIMC బస్సీ ఆసుపత్రి వైద్యులు డా.సాహిల్​ చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వల్ల.. బతికే అవకాశాలు లేవని నిర్ధరించుకున్నాకే వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా తాము కోరామని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. ఇందుకోసమే ప్రత్యేక వెంటిలేటర్​పై ఆయనను ఉంచి అంబులెన్స్​లో తరలిస్తున్న సమయంలో శరీరంలోని అవయవాలు కదిలాయని డాక్టర్లు అంటున్నారు. అంతేగానీ మన్​ప్రీత్​ చనిపోయాడని తమ సిబ్బంది ఎవరూ చెప్పలేదని చెబుతున్నారు.

అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు.. ఇంతలోనే!
మన్​ప్రీత్​ చనిపోయాడని తెలుసుకున్న తోటి పోలీసులు, కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. పైగా ఆయన అంత్యక్రియలకు అన్నీ ఏర్పాట్లు కూడా చేశారు. ఇక మన్​ప్రీత్​ బతికే ఉన్నాడన్న వార్త తెలుసుకున్న అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

Last Updated :Sep 20, 2023, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.