తెలంగాణ

telangana

'ఇంటింటికీ కరోనా టీకా​ పంపిణీ అసాధ్యం'

By

Published : Sep 8, 2021, 3:05 PM IST

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పరిస్థితులు ఉంటాయని, అందువల్ల ఇంటింటికీ కరోనా టీకా పంపిణీ(door to door vaccination) సాధ్యం కాదని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. ప్రస్తుతం దేశంలో అమలవుతోన్న విధానాన్ని(corona vaccination in india) రద్దు చేసేందుకు ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. పిటిషనర్​ ఆరోగ్య శాఖను ఆశ్రయించాలని సూచించింది.

VACCINATION
ఇంటింటికి కరోనా టీకా​ పంపిణీ

భారత్‌లోని వైవిధ్య పరిస్థితుల నేపథ్యంలో ఇంటింటికీ కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ(door to door vaccination) సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ పంపిణీకి ప్రస్తుతం దేశంలో అమలు అవుతున్న విధానం(corona vaccination in india) రద్దుకు ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది.

దివ్యాంగులు, సమాజంలోని వెనకబడిన వర్గాలకు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు వీలుగా ఇంటింటి పంపిణీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని యూత్‌ బార్‌ అసోసియేషన్‌ సంస్థం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్​ విక్రమ్​ నాథ్​, జస్టిస్​ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

" కేరళతో పోలిస్తే లద్దాఖ్​లో పరిస్థితులు వేరు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తర ప్రదేశ్​లో పరిస్థితులు వేరుగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. పట్టణాల్లో పరిస్థితులు భిన్నం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పరిస్థితులు ఉంటాయి. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 60 శాతం ప్రజలకు తొలి డోసు అందింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య శాఖ ఎంతటి ఒత్తిడిలో ఉంటుందో మాకు తెలుసు. ఆక్సిజన్‌ సరఫరా సహా ఇతర అంశాలను కూడా పట్టించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇంటింటి వ్యాక్సినేషన్‌కు ఉన్న ఇబ్బందిని అర్థం చేసుకోవాలి. "

- సుప్రీం ధర్మాసనం

ఇంటింటికీ వ్యాక్సినేషన్​ అనేది.. ప్రభుత్వ పరిధిలోని అంశం అయినందున, ప్రస్తుత విధానాన్ని రద్దు చేయలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై పిటిషనర్‌ ఆరోగ్య శాఖను ఆశ్రయించాలని సూచించింది.

ఇదీ చూడండి:భారత్​ మరో ఘనత- టీకా పంపిణీ@70కోట్లు

ABOUT THE AUTHOR

...view details