తెలంగాణ

telangana

'5 ఎకరాల భూమి స్వీకరణపై చర్చించాకే నిర్ణయం'

By

Published : Nov 10, 2019, 5:25 PM IST

అయోధ్య భూవివాదం కేసులో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. బాబ్రీ మసీదు కోసం 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. అయితే సుప్రీం చెప్పిన 5 ఎకరాల భూమిని అంగీకరించాలో, లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు సున్ని వక్ఫ్​ బోర్డు ఈ నెల 26న సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు  తెలిపింది.

'5 ఎకరాల భూమి స్వీకరణపై చర్చించాకే నిర్ణయం'

అతి సున్నితమైన అయోధ్య భూవివాదం కేసులో తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. అయోధ్యలోని వివాదాస్పద భూమిలో రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేటాయించిన 5 ఎకరాలను తీసుకోవాలో వద్దో నిర్ణయం తీసుకోవటానికి ఈ నెల 26న సమావేశం కానున్నట్లు సున్నీ వక్ఫ్​ బోర్డు తెలిపింది.

"సుప్రీం కోర్టు కేటాయించిన 5 ఎకరాల భూమిని అంగీకరించాలా, వద్దా అనే నిర్ణయంపై ఈ నెల 26న సమావేశం జరిగే అవకాశం ఉంది. సమావేశం నవంబర్​ 13న జరగాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల 26కు వాయిదా పడింది. ఈ విషయంలో చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ సానుకూల దృక్పథంతో ఇలాంటి ప్రతికూలతలను అధిగమించవచ్చని అనుకుంటున్నాను."
-జుఫర్​ ఫరూకి, సున్నీ వక్ఫ్​ బోర్డు ఛైర్మన్​

మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల భూమిని అంగీకరించవద్దని పలువురు ముస్లిం నాయకులు.. సున్నీ వక్ఫ్​ బోర్డ్​ను కోరారు. అయితే భూమి విషయంలో అందరి అభిప్రాయాలను తీసుకొని ముందుకు వెళతామని ఫరూకి స్పష్టం చేశారు.

రామ భక్తుల పూజలు...

అయోధ్య వివాదాస్పద భూమిలో రామమందిర నిర్మాణానికి సుప్రీం అనుమితిచ్చిన నేపథ్యంలో రామభక్తులు అన్ని దేవాలయాల్లో పూజలను నిర్వహించారు. రామ, ఆంజనేయుని అలయాలు భక్తులతో కిటకిలాడాయి. చాలా మంది భక్తులు రామ మందిరంలో ముడుపులు చెల్లించుకున్నారు.

ఇదీ చూడండి:విధులను విస్మరించి వాట్సాప్​ చాటింగ్​ చేసినందుకు...

ABOUT THE AUTHOR

...view details