తెలంగాణ

telangana

గ్యాంగ్​రేప్​ కేసులో 13మందికి 20 ఏళ్ల జైలు శిక్ష

By

Published : Dec 19, 2021, 6:30 AM IST

gang rape
గ్యాంగ్​ రేప్​

Gang Rape case Rajasthan: బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన కేసులో రాజస్థాన్​లోని కోటా కోర్టు​ కీలక తీర్పునిచ్చింది. ఈ కేసుతో సంబంధం ఉన్న 16 మందికి శిక్షను ఖరారు చేసింది. వారిలో 13 మందికి 20 ఏళ్లపాటు జైలు శిక్ష విధించింది.

Gang Rape case Rajasthan: ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో రాజస్థాన్​లోని కోటా కోర్టు​ కీలక తీర్పు ఇచ్చింది. 15 ఏళ్ల బాలికపై తొమ్మిది రోజుల పాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన 13 మందికి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. మరో ఇద్దరికి నాలుగేళ్ల జైలు శిక్షను ఖారారు చేసింది. పోక్సో చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టుకు నేతృత్వం వహించిన అదనపు సెషన్స్ జడ్జి అశోక్ చౌదరి ఈ మేరకు తీర్పు చెప్పారు. బాలికను ఇంటి నుంచి అపహరించి.. ఝలావర్‌కు తీసుకెళ్లి పలువురికి విక్రయించినందుకు ఒక మహిళకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. 20 ఏళ్లు జైలు శిక్ష పడిన వారు ఒక్కొక్కరికి రూ. 10 వేల జరిమానా విధించారు న్యాయమూర్తి అశోక్​ చౌదరీ. నాలుగేళ్లు శిక్ష పడిన వారు రూ. 7 వేలు కట్టాలని ఆదేశించారు.

ఈ కేసులో మొత్తంగా 16 మందికి శిక్ష విధించింది కోర్టు. మరోవైపు ఈ కేసుతో సంబంధం ఉన్న 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. దీనికి సంబంధించిన నలుగురు మైనర్లు ఇప్పటికే స్థానిక జువెనల్ జస్టిస్ బోర్డులో వేర్వేరుగా విచారణ ఎదుర్కొంటున్నారు.

ఇదీ చూడండి:స్వర్ణదేవాలయంలో ఆగంతుకుడు హల్​చల్​.. భక్తుల దాడిలో మృతి

ABOUT THE AUTHOR

...view details