ETV Bharat / bharat

స్వర్ణదేవాలయంలో ఆగంతుకుడు హల్​చల్​.. భక్తుల దాడిలో మృతి

author img

By

Published : Dec 18, 2021, 9:33 PM IST

Updated : Dec 18, 2021, 10:56 PM IST

Golden Temple
స్వర్ణదేవాలయం

Golden Temple Death: పంజాబ్‌ అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని అపవిత్రం చేయబోయాడన్న కారణంతో ఓ యువకుడిపై దాడి చేశారు కొందరు భక్తులు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు అమృత్​సర్ డీసీపీ పరమీందర్ సింగ్ బందాల్​ తెలిపారు.

Golden Temple Death: పంజాబ్​ అమృత్​సర్​లో షాకింగ్ ఘటన జరిగింది. స్వర్ణ మందిరంలో చొరబడిన ఆగంతుకుడు.. అక్కడున్న కత్తిని తీసుకుని.. గురుగ్రంథ్‌ సాహిబ్‌ వైపు వెళ్లాడు. ఈ క్రమంలో.. ఆగంతుకుడిని శిరోమణి గురుద్వారా ప్రబంధక్​ కమిటీ (ఎస్​జీపీసీ) టాస్క్​ఫోర్స్​ సిబ్బంది అడ్డుకున్నారు. వెంటనే ఆ యువకుడిపై భక్తులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు మృతిచెందినట్లు అమృత్​సర్​ డీసీపీ పరమీందర్ సింగ్ బందాల్​ తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు వివరించారు.

ఆగంతుకుడిపై దాడి చేసిన భక్తులు

"ఆగంతుకుడికి 20-25 ఏళ్ల వయసు ఉంటుంది. దేవాలయంలోకి చొచ్చుకుని వచ్చాడు. గురుగ్రంథ్​ సాహిబ్ వద్ద ఉన్న కత్తిని తీసుకొని ఆలయాన్ని అపవిత్రం చేయబోయాడు. ఆ తర్వాత భక్తులు యువకుడిపై దాడి చేశారు. యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అప్పటికే మృతిచెందాడు."

-- పరమీందర్ సింగ్ బందాల్, అమృత్​సర్​ డీసీపీ

మృతదేహాన్ని అమృతసర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని పరమీందర్ సింగ్ తెలిపారు. యువకుడి పోస్ట్​మార్టం ఆదివారం జరుగుతుందన్నారు. భక్తులంతా సంయమనం పాటించాలని.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

ఈ ఘటనకు సంబంధించి స్థానిక సీసీటీవీ దృశ్యాలను సేకరించి విచారిస్తున్నామని తెలిపారు.

పవిత్రమైన గురుగ్రంథ్‌ సాహిబ్‌ పుస్తకం సురక్షితంగానే ఉందన్నారు. దానిని ఎవరూ పట్టుకోలేదని స్పష్టం చేశారు.

కేంద్రం ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలి..

ఈ ఘటనపై కేంద్రం జోక్యం చేసుకుని ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ డిమాండ్​ చేశారు.

మరోవైపు భాజపా నేత మంజిందర్​ సింగ్ శిశ్రా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో కుట్రపూరితంగానే ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇటీవల ఇలాంటి ఘటనే జరిగితే.. తాను కేంద్ర హోం మంత్రి అమిత్​షాకు చెప్పానని.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలన్నారు.

అయితే సదరు ఆగంతుకుడు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.

ఇదీ చూడండి: Monkey Revenge: ప్రతీకారంతో 300 శునకాలను చంపిన కోతులు!

Last Updated :Dec 18, 2021, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.