తెలంగాణ

telangana

పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించిన నారి - ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం

By ETV Bharat Telangana Team

Published : Mar 8, 2024, 12:58 PM IST

WOMENS DAY 2024 : అసలే నిరుపేద కుటుంబం. చిన్న వయసులోనే తండ్రిని కోల్పొవడంతో ఎన్నో కష్టాలు ఆమెను చుట్టుముట్టాయి. ఆర్థిక పరిస్థితులు బాలేక చదువు ఆపేద్దాం అనుకుంది. కానీ, కూలీనాలీ చేస్తూ తల్లి, సోదరుడు ఆమెను చదివించారు. తన చదువు కోసం వారు పడే కష్టాన్ని చూసిన ఆ యువతి, ఏలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్య సాధన కోసం నిర్విరామంగా శ్రమించింది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గొప్ప అనుకుంటే ఏడాది వ్యవధిలో ఏకంగా 5 ప్రభుత్వ కొలువులు కైవసం చేసుకుంది ఆ యువతి. భవిష్యత్తులో కలెక్టర్‌ కావాలన్నదే ధ్యేయంగా ముందుకుసాగుతున్న ఆ నిరుపేద ఆణిముత్యం గురించి మనమూ తెలుసుకుందాం.

Woman got five Government Jobs in Suryapet
Woman Got Five Government Jobs with in a Year

పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించిన నారి - ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం

WOMENS DAY 2024 :చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయురాలు కావాలనేది మంగమ్మ కల. దాని కోసం ప్రణాళిక ప్రకారం శ్రమించింది. పీజీ గురుకుల నోటిఫికేషన్ విడుదల కావడంతో వాటి కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో కేజీబీవీ(KGBV) నోటిఫికేషన్ కూడా విడుదలైంది. కేజీబీవీలో సీఆర్​టీ (CRT), పీజీ సీఆర్​టీ (PGCRT) ఉద్యోగాలకు ఎంపికైంది. పీజీసీఆర్​టీ ఎంచుకుని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌లో ఉద్యోగం చేస్తూనే గురుకుల పరీక్షలు రాసింది. ఇటీవల విడుదల అయిన ఫలితాలలో పీజీటీ (PGT), జేఎల్​, టీజీటీ (TGT) ఉద్యోగాలకు ఎంపికైంది మంగమ్మ. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన ఈ యవతి పేరు మందుల మంగమ్మ.

Woman Got 5 Government Jobs with in a Year : తల్లిదండ్రులు ఈదయ్య, సుశీల వ్యవసాయ కూలీలు. పదేళ్ల కిందట తండ్రి ఈదయ్య అనారోగ్యంతో మృతిచెందారు. అప్పటికే పదో తరగతి పూర్తి చేసిన మంగమ్మకు తండ్రి మరణంతో ఉన్నత చదువులకు ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో సోదరుడు అండగా నిలవగా డిగ్రీ, బీఈడీ, ఎంఏ తెలుగు పూర్తి చేసింది మంగమ్మ. పట్టుదలతోపై చదువులు చదివిన మంగమ్మ, ప్రభుత్వ కొలువు సాధించేందుకు పటిష్ఠమైన ప్రణాళికతో ముందుకుసాగింది. పోటీ పరీక్షల నోటిఫికేషన్ రావడానికి ముందు నుంచే తన లక్ష్యం వైపు అడుగులు వేసింది మంగమ్మ. ఫలితంగా ఏడాది వ్యవధిలోనే మెుత్తం అయిదు ఉద్యోగాలు సాధించి తోటి యవతకి ఆదర్శంగా నిలుస్తోంది.

Suryapet Women Crack 5 Jobs in a Year : ఆర్థిక పరిస్థితులు బాగా లేకుండా చదువులు కొనసాగించలేమని, వివాహం చేసుకోవాలని తన బంధువులు ఎంతగా వెనక్కి లాగినా అవి ఏమి పట్టించుకోలేదు మంగమ్మ. అన్న చదువుకున్న వాడు కావడంతో ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని తన చదువుకు అండగా నిలబడ్డాడు. మహిళలకు కుటుంబం నుంచి ప్రోత్సాహం అందిస్తే వారు అన్ని రంగాల్లో రాణిస్తారంటున్నాడు మంగమ్మ సోదరుడు రాంబాబు. చదువుతోనే మన జీవితాలు బాగుపడతాయని నమ్మిన మంగమ్మ ఆ దిశగానే అడుగులేసింది. తన విజయంతో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మంగమ్మ జీవితం కథ కాదు, నేటి తరం యువశక్తికి నిలువెత్తు నిదర్శనం.

'మా అమ్మనాన్న వ్యవసాయం చేస్తారు. పదేళ్ల క్రితం మా నాన్న చనిపోయారు. ఆ తర్వాత మా అమ్మనే కుటుంబాన్ని పోషించింది. టెన్త్​ వరకు జిల్లాలోని రామాపురం గ్రామంలో చదువుకున్నా. ఇంటర్​ ప్రైవేట్​ కళాశాలలో చదువుకుందామని అనుకున్నా కానీ అప్పుడే ఆర్థిక పరిస్థితి బాలేదు. దీంతో నడిగూడెంలోని ప్రభుత్వ కళాశాలలో చదివా. టీచర్​ అవ్వాలని చిన్నపటి నుంచి నా కల. ఎలా అయినా సాధించాలని శ్రమించా.'-మంగమ్మ, రామాపురం

ఖమ్మం బిడ్డ అదరగొట్టే - ఆర్థిక అవరోధాలున్నా ఆరేళ్లు సాధన - ఒకేసారి 4 సర్కారీ కొలువులు

ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపికై అమ్మనాన్నల కలను నిజం చేసిన సూర్యాపేట యువకుడు

ABOUT THE AUTHOR

...view details